Telangana: అంజద్ ఉల్లా ఖాన్ పోరాటం మరువలేనిది..
ABN , Publish Date - Jul 04 , 2024 | 04:50 PM
ప్రజాసమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న యోధుడు అంజద్ ఉల్లా ఖాన్ అని నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు ఎస్.జె.కె.అహ్మద్ పేర్కొన్నారు.
ప్రజాసమస్యల పరిష్కారం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న యోధుడు అంజద్ ఉల్లా ఖాన్ అని నేతాజీ యువజన సంఘం అధ్యక్షుడు ఎస్.జె.కె.అహ్మద్ పేర్కొన్నారు. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన ఎంబీటీ (MBT) రాష్ట్ర అధికార ప్రతినిధి అంజద్ ఉల్లా ఖాన్ ను ఇవాళ పాల్వంచ పట్టణానికి చెందిన నేతాజీ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్.జె.కె.అహ్మద్ (Ahmed) పరామర్శించారు. పాతబస్తి లోని బాబా నగర్‌లోని ఆయన ఫామ్ హౌస్ లో అంజద్ ఉల్లా ఖాన్ ను మర్యాదపూర్వకంగా కలిసి అహ్మద్ సత్కరించారు.
CM Revanth Reddy: ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ..
నేతాజీ యువజన సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్.జె.కె.అహ్మద్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూ ప్రజా సమస్యల పరిష్కార దిశగా అంజద్ ఉల్లా ఖాన్ చేస్తున్న కృషి ప్రశంసనీయం అని ప్రశంసించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వస్తున్న బాధితుల సమస్యలను తన ప్రజాదర్బార్ లో ఎంతో ఓపికగా విని వారికి అండగా నిలుస్తున్న అంజద్ ఉల్లా ఖాన్ సేవలు అభినందనీయమని కొనియాడారు.
BRS: మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
మేలో ప్రమాదం..
మజ్లీస్ బచావో తెహ్రీక్(ఎంబిటి) నాయకుడు అంజద్ ఉల్లా ఖాన్ మే14వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. మలక్ పేట్ లోని అక్బర్ బాగ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన చేయి ఫ్రాక్చర్ కావడంతో విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. దీంతో దాదాపు నెలన్నర పాటు ఆయన విశ్రాంతిలో ఉన్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో ఎంబిటి పోటీ చేయకపోయినప్పటికీ పెద్ద సంఖ్యలో ఓటర్లు ఓటేయాలని కోరారు. అంజద్ ఉల్లా ఖాన్ పాతబస్తీ ప్రాంతం ప్రజల కోసం ఎన్నో పోరాటాలు చేశారు. గతంలో కార్పొరేటర్‌గానూ పనిచేశారు.
NCW: మియాపూర్ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More Telangana News and Latest Telugu News