Share News

Ponguleti Srinivas: ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే తిరిగి ఇచ్చేయండి.. లేకపోతే

ABN , Publish Date - Jan 02 , 2024 | 02:59 PM

Telangana: డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం ఉవ్వెత్తున నడుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి మార్కెట్ యార్డు నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. పేదవాడిని అన్ని రంగాల్లో అదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వం ఎకైక ఎజెండా అని స్పష్టం చేశారు. ప్రజలు కోరుకునేదే ప్రభుత్వం చేస్తుందన్నారు.

Ponguleti Srinivas: ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే తిరిగి ఇచ్చేయండి.. లేకపోతే

ఖమ్మం, జనవరి 2: డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం ఉవ్వెత్తున నడుస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivas reddy) అన్నారు. మంగళవారం ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి మార్కెట్ యార్డు నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. పేదవాడిని అన్ని రంగాల్లో అదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వం ఎకైక ఎజెండా అని స్పష్టం చేశారు. ప్రజలు కోరుకునేదే ప్రభుత్వం చేస్తుందన్నారు.

ఎన్ని ఇబ్బందులు ఉన్నా తప్పించుకోకుండా ఇబ్బందులను అధిగమించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని తేల్చిచెప్పారు. మద్దులపల్లి మార్కెట్ యార్డు నిర్మాణం పేరుతో మట్టి దిబ్బలను తరలించి కొంత మంది కోట్ల రూపాయల సంపాందించారని ఆరోపించారు. అక్రమార్కులను వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు. ఖమ్మంలో కోట్లు విలువచేసే భూమిని కబ్జా చేస్తే వారి నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆస్తి పేదలకు దక్కుతుందన్నారు. ఎవరైనా ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే తిరిగి అప్పగించాలని లేకుంటే ప్రభుత్వం తన పని తను చేసుకుంటూ పోతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఒక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 02 , 2024 | 02:59 PM