మంత్రి సురేఖపై నాగార్జున కేసు 19కి వాయిదా
ABN , Publish Date - Dec 13 , 2024 | 03:14 AM
రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసు విచారణ మరోసారి వాయిదా పడింది.
హైదరాబాద్, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖపై సినీ నటుడు అక్కినేని నాగార్జున వేసిన పరువు నష్టం దావా కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. గురువారం నాంపల్లిలోని ప్రత్యేక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఎక్సైజ్ కోర్టులో ఈ కేసుపై జరిగిన విచారణకు కొండా సురేఖ తరఫున ఆమె న్యాయవాది గుర్మీత్ సింగ్ హాజరయ్యారు. విచారణకు సురేఖ వ్యక్తిగతంగా హాజరవడానికి మరికొంత సమయం కావాలని ఆయన కోరారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణను ఈనెల 19వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.