Share News

ఆటో కార్మికులను ఆదుకోవాలి: కూనంనేని

ABN , Publish Date - Sep 23 , 2024 | 05:40 AM

ఆటో, క్యాబ్‌ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు.

ఆటో కార్మికులను ఆదుకోవాలి: కూనంనేని

కొత్తగూడెం, సెప్టెంబర్‌ 22 (ఆంధ్రజ్యోతి): ఆటో, క్యాబ్‌ కార్మికులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. కొత్తగూడెం క్లబ్‌లో ఆటో వర్కర్స్‌ యూనియన్‌ తెలంగాణ రాష్ట్ర తృతీయ మహాసభల్లో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆటో, క్యాబ్‌ కార్మికులకు ప్రతినెల రూ.12వేలు అందించి ఆదుకోవాలన్నారు. రూ.10లక్షల వరకు బీమా సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

Updated Date - Sep 23 , 2024 | 05:40 AM