Share News

Srisailam: శ్రీశైలం, సాగర్‌కు స్వల్పంగా పెరిగిన వరద

ABN , Publish Date - Oct 20 , 2024 | 04:01 AM

కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద స్వల్పంగా పెరిగింది. శనివారం శ్రీశైలానికి 1.19 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా... రెండు వైపుల జలవిద్యుత్‌ ఉత్పాదన

Srisailam: శ్రీశైలం, సాగర్‌కు స్వల్పంగా పెరిగిన వరద

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) : కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద స్వల్పంగా పెరిగింది. శనివారం శ్రీశైలానికి 1.19 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా... రెండు వైపుల జలవిద్యుత్‌ ఉత్పాదన, పోతిరెడ్డిపాడు నుంచి, అలాగే నాలుగు గేట్ల ద్వారా నీటిని వదులుతూ 1.79 లక్షలను జలాశయం నుంచి బయటికి తరలించారు. నాగార్జునసాగర్‌కు 1.08 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా... 18 గేట్లు ఎత్తి, జలవిద్యుదుత్పాదన చేస్తూ దిగువకు తరలిస్తున్నారు.


  • నేడు భారీ వర్ష సూచన

తెలంగాణలో ఆది, సోమవారాల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నెల 22 వరకు యెల్లో అలెర్ట్‌ జారీ చేసింది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Updated Date - Oct 20 , 2024 | 04:01 AM