Share News

TS News: ఎమ్మెల్సీ కవితను కలిసిన కేటీఆర్, హరీశ్‌రావు

ABN , Publish Date - Mar 17 , 2024 | 06:29 PM

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) అరెస్టయిన విషయం తెలిసిందే. ఆమెను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, కవిత భర్త అనిల్, న్యాయవాది మోహిత్ రావు ఆదివారం కలిశారు. కవిత యోగ క్షేమాలు తెలుసుకుని న్యాయపోరాటంపై చేద్దామని కవితకు ధైర్యం చెప్పారు.

TS News: ఎమ్మెల్సీ కవితను కలిసిన కేటీఆర్, హరీశ్‌రావు

ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) అరెస్టయిన విషయం తెలిసిందే. ఆమెను ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, కవిత భర్త అనిల్, న్యాయవాది మోహిత్ రావు ఆదివారం కలిశారు. కవిత యోగ క్షేమాలు తెలుసుకుని న్యాయపోరాటంపై చేద్దామని కవితకు ధైర్యం చెప్పారు. గంటన్నర పాటు కవితతో కుటుంబసభ్యులు మాట్లాడారు. కవితను ఆమె తరపు న్యాయవాది మోహిత్‌రావు కలిశారు. ఈడీ ఆఫీస్ బయటే మాజీమంత్రి ప్రశాంత్‌రెడ్డి ఉన్నారు.

కాగా.. కవితకు ఈ కేసులో కాస్త రిలీఫ్ దక్కింది.! వారం రోజుల పాటు కవితను ఈడీ కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. శనివారం నాడు ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టులో సుదీర్ఘంగా జరిగిన వాదనల అనంతరం.. ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు అనుమతి ఇచ్చింది. అయితే.. కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతివ్వాలని కోర్టును కోరగా సానుకూలంగా స్పందించింది. ‘ప్రతిరోజూ కుటుంబ సభ్యులు, న్యాయవాదులు కవితను కలవొచ్చు. ఇంటి నుంచి భోజనం తెప్పించుకోవచ్చు’ అని కోర్టు తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 17 , 2024 | 10:25 PM