Share News

KTR: అభద్రతాభావానికి పరాకాష్ట

ABN , Publish Date - Dec 14 , 2024 | 03:28 AM

అల్లు అర్జున్‌ అరెస్టును మాజీ మంత్రి కేటీఆర్‌ ఖండించారు. జాతీయ అవార్డు పొందిన నటుడిని అరెస్టు చేయడం పాలకుల అభద్రతాభావానికి పరాకాష్ట అని విమర్శిస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేశారు.

KTR: అభద్రతాభావానికి పరాకాష్ట

  • అల్లు అర్జున్‌ అరెస్టుపై మాజీ మంత్రి కేటీఆర్‌

  • హైడ్రా భయంతో మృతి చెందిన వారి విషయంలో

  • సీఎం రేవంత్‌ను అరెస్టు చేయాలని వ్యాఖ్య

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): అల్లు అర్జున్‌ అరెస్టును మాజీ మంత్రి కేటీఆర్‌ ఖండించారు. జాతీయ అవార్డు పొందిన నటుడిని అరెస్టు చేయడం పాలకుల అభద్రతాభావానికి పరాకాష్ట అని విమర్శిస్తూ ఎక్స్‌లో ఓ పోస్ట్‌ చేశారు. సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో మరణించిన మహిళ కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. కానీ, ఆ రోజు జరిగిన ఘటనలో నిజంగా తప్పు ఎవరిది? అని కేటీఆర్‌ ప్రశ్నించారు. నేరుగా బాధ్యుడు కాని అర్జున్‌ను సాధారణ నేరగాడిలా పరిగణించడం సరికాదన్నారు. హైడ్రా భయంతో హైదరాబాద్‌లో ఇద్దరి మరణానికి కారణమైన సీఎం రేవంత్‌ను కూడా ఇలాగే అరెస్ట్‌ చేయాలని కేటీఆర్‌ పేర్కొన్నారు.

Updated Date - Dec 14 , 2024 | 03:28 AM