Share News

KTR: రేవంత్‌ సృష్టించిన భయంతో ఆదాయం తగ్గింది

ABN , Publish Date - Oct 08 , 2024 | 04:21 AM

తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్‌ను కాపాడుకోవడం చేతగాక సీఎం రేవంత్‌రెడ్డి సామాన్యులపైకి బుల్డోజర్లు పంపి భయాన్ని సృష్టించడంతో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోయిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

KTR: రేవంత్‌ సృష్టించిన భయంతో ఆదాయం తగ్గింది

  • రిజిస్ట్రేషన్లు, రియల్‌ ఎస్టేట్‌ పడిపోయాయి

  • తెలంగాణను ఏం చేద్దామనుకుంటున్నారు?:కేటీఆర్‌

హైదరాబాద్‌, అక్టోబరు7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు గుండెకాయ వంటి హైదరాబాద్‌ను కాపాడుకోవడం చేతగాక సీఎం రేవంత్‌రెడ్డి సామాన్యులపైకి బుల్డోజర్లు పంపి భయాన్ని సృష్టించడంతో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోయిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. పనిమంతుడు పందిరేస్తే పిల్లి తోక తగిలి కూలిందన్నట్లు సీఎం తీరు ఉందంటూ ఆయన ఎక్స్‌ వేదికగా ఎద్దేవా చేశారు. హైడ్రా హైరానాతో రెండు నెలల్లో హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌, రిజిస్ట్రేషన్లు పడిపోయి సర్కారు ఆదాయం తగ్గిపోయిందన్నారు.


కొత్తగా ఆదాయం సృష్టించకపోయినా ఉన్నది ఊడగొడుతూ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఫోర్‌బ్రదర్‌ సిటీపై ఫోకస్‌ చేసి అక్కడ కృత్రిమ రియల్‌ బూమ్‌కోసం ఆలోచిస్తున్నారని, సామాన్యుల ద్వారా కొనుగోలు, అమ్మకాలు లేకుంటే ఆదాయం ఎలా పెరుగుతుందని ఆయన రేవంత్‌ను ప్రశ్నించారు. తెలంగాణను ఏం చేద్దామనుకుంటున్నావ్‌ స్వామీ అంటూ కేటీఆర్‌ నిలదీశారు. రాష్ట్రం అప్పుల పాలైందంటూ డబ్బులు లేవంటున్న రేవంత్‌ మూసీపేరిట లక్షన్నరకోట్ల సోకులు ఎవరి ప్రయోజనం కోసమో చెప్పాలన్నారు.

Updated Date - Oct 08 , 2024 | 04:21 AM