Share News

Flood Relief: సర్కారు నిర్లక్ష్యానికి 20 మంది బలి: కేటీఆర్‌

ABN , Publish Date - Sep 03 , 2024 | 03:44 AM

రాష్ట్రంలో వరద సహాయక చర్యలు చేపట్టడంలో రేవంత్‌ సర్కారు విఫలమైందని..

Flood Relief: సర్కారు నిర్లక్ష్యానికి 20 మంది బలి: కేటీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వరద సహాయక చర్యలు చేపట్టడంలో రేవంత్‌ సర్కారు విఫలమైందని.. ఈ నిర్లక్ష్యం ఖరీదు 20 మంది ప్రాణాలు కోల్పోవడమేనని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ‘ఎక్స్‌’ వేదికగా విమర్శించారు. ఏపీ ప్రభుత్వం ఆరు రెస్క్యూ హెలికాప్టర్లను, 150 బోట్లు ఉపయోగించి.. ప్రజలను కాపాడుతోందని, ఇక్కడి ప్రభుత్వం మాత్రం హెలికాప్టర్లు తెప్పించేందుకు కూడా తాత్సారం చేస్తోందని విమర్శించారు.


వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ హయాంలో చేపట్టిన పనుల వల్లే హైదరాబాద్‌కు వరద ముప్పు తప్పిందని అన్నారు. తెలంగాణ భవన్‌లో మాజీమంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘మంత్రుల పర్యటనకు హెలికాప్టర్‌ దొరుకుతోంది.. వరదల్లో చిక్కుకున్న ప్రజలను కాపాడ్డానికి మాత్రం ప్రభుత్వానికి హెలికాప్టర్‌ దొరకడం లేదా?’ అని ప్రశ్నించారు.

Updated Date - Sep 03 , 2024 | 03:44 AM