Share News

KTR: అనుమతుల్లేకుండా టెండర్లు ఎలా పిలిచారు?

ABN , Publish Date - Nov 04 , 2024 | 04:13 AM

‘‘అవినీతి జరిగిందని బురదజల్లి.. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కక్షగట్టి రైతుల పొట్టగొట్టిన మీరు.. సీతారామ ఎత్తిపోతల పథకానికి అనుమతి లేకుండానే రూ.1074కోట్ల పనులకు టెండర్లు ఎలా పిలిచారు?’’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

KTR: అనుమతుల్లేకుండా టెండర్లు ఎలా పిలిచారు?

  • మత్స్యకారుల జీవితాల్లో మట్టికొట్టిన సర్కార్‌: కేటీఆర్‌

హైదరాబాద్‌, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ‘‘అవినీతి జరిగిందని బురదజల్లి.. కాళేశ్వరం ప్రాజెక్టు మీద కక్షగట్టి రైతుల పొట్టగొట్టిన మీరు.. సీతారామ ఎత్తిపోతల పథకానికి అనుమతి లేకుండానే రూ.1074కోట్ల పనులకు టెండర్లు ఎలా పిలిచారు?’’ అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజాపాలన అని పొద్దుకు పదిమార్లు ప్రగల్భాలు పలికెటోళ్లు.. ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీల పనుల్లో నిబంధలు ఎలా తుంగలో తొక్కారని ఆదివారం ఎక్స్‌ వేదికగా ఆయన నిలదీశారు.


కాగా.. తెలంగాణలోని మత్స్యకారుల జీవితాల్లో రేవంత్‌ సర్కార్‌ మట్టికొట్టిందని, కాంగ్రెస్‌ పాలనలో పథకాలను నామరూపాల్లేకుండా చేస్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. మూసీ మురికిలో కోట్లు కుమ్మరించడంపై ఉన్నప్రేమ.. జలాశయాల్లో జలపుష్పాలను వదలడంలో లేదని, ముదిరాజ్‌ సోదరుల దీనస్థితిపై ప్రభుత్వం ఏమాత్రం దృష్టిపెట్టడం లేదని ఆయన విమర్శించారు.

Updated Date - Nov 04 , 2024 | 04:13 AM