Gutta Sukender Reddy: విద్యావ్యవస్థను పరిరక్షించాలి:గుత్తా సుఖేందర్
ABN , Publish Date - Dec 29 , 2024 | 04:37 AM
విద్యావ్యవస్థను పరిరక్షించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎ్‌సయూటీఎఫ్) 6వ విద్యా, వైజ్ఞానిక మూడు రోజుల మహాసభలు శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రారంభమయ్యాయి. Legislative Council Chairman Gutta Sukender Reddy Emphasizes Teachers' Role in Protecting Education System
నల్లగొండలో యూటీఎఫ్ రాష్ట్ర 6వ మహాసభలు ప్రారంభం
నల్లగొండ, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): విద్యావ్యవస్థను పరిరక్షించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎ్‌సయూటీఎఫ్) 6వ విద్యా, వైజ్ఞానిక మూడు రోజుల మహాసభలు శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్య ఉన్న చోటనే అభివృద్ధి ఉంటుందని, ఒక కుటుంబంలో ఒక్కరు విద్యావంతులైతే ఆ కుటుంబ సభ్యులందరూ అభివృద్ధి చెందుతారన్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం వల్లే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు లేకుండా పోయాయని ఆరోపించారు.
ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. విద్యావిధానాన్ని కాషాయీకరణం చేయడం సరికాదని పేర్కొన్నారు. సీనియర్ సంపాదకులు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థులను గొప్ప పౌరులుగా, సమాజ మార్పునకు కృషి చేసేలా తీర్చిదిద్దాలన్నారు. ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ మాట్లాడుతూ.. దేశంలో పాలకులు అవలంబిస్తున్న అసంబద్ధమైన విధానాలతో సమాజంలో అంతరాలు పెరుగుతున్నా యన్నారు. టీఎ్‌సయూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య మాట్లాడుతూ.. ఇన్‌చార్జీల పాలనలో ఉన్న విద్యా వ్యవస్థను సరిదిద్దాలని డిమాండ్ చేశారు.