Share News

Bhadradri: ఏసీబీకి చిక్కిన పాల్వంచ లైన్‌ఇన్‌స్పెక్టర్‌

ABN , Publish Date - Oct 24 , 2024 | 03:46 AM

విద్యుత్‌ చౌర్యం ఘటనలో కేసు లేకుండా చేసేందుకు ఓ వ్యక్తి వద్ద నుంచి లంచం తీసుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లైన్‌ఇన్‌స్పెక్టర్‌ జిలుగు నాగరాజు ఏసీబీకి చిక్కాడు.

Bhadradri: ఏసీబీకి చిక్కిన పాల్వంచ లైన్‌ఇన్‌స్పెక్టర్‌

పాల్వంచ, అక్టోబరు 23: విద్యుత్‌ చౌర్యం ఘటనలో కేసు లేకుండా చేసేందుకు ఓ వ్యక్తి వద్ద నుంచి లంచం తీసుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ లైన్‌ఇన్‌స్పెక్టర్‌ జిలుగు నాగరాజు ఏసీబీకి చిక్కాడు. కరకవాగుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి తాను నిర్మించుకుంటున్న ఇంటికి క్యూరింగ్‌ కోసం పక్కనే ఉన్న తన మేనమామ ఇంటి నుంచి విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకుని వాడుకుంటున్నాడు. అయితే సాధారణ తనిఖీల్లో భాగంగా అక్కడకు వెళ్లిన లైన్‌ ఇన్‌స్పెక్టర్‌... నాగరాజు అక్రమంగా విద్యుత్‌ వినియోగిస్తున్న విషయాన్ని గుర్తించి విద్యుత్‌ చౌర్యం కేసు నమోదు చేస్తానని హెచ్చరించాడు.


అలా జరగకుండా ఉండాలంటే సెటిల్‌మెంట్‌ చేసుకోవాలని అతనిపై ఒత్తిడి తెచ్చాడు. రూ.68 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. బేరమాడితే చివరకు రూ.26 వేలకు అంగీకరించాడు. లంచం ఇవ్వడం ఇష్టంలేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వారి సూచన మేరకు లంచం ఇస్తుండగా లైన్‌ఇన్‌స్పెక్టర్‌ను అధికారులు పట్టుకున్నారు. అనంతరం అతణ్ని స్థానిక సబ్‌స్టేషన్‌కు తరలించి పంచనామా నిర్వహించారు.

Updated Date - Oct 24 , 2024 | 03:46 AM