Mahesh Kumar Goud: కాంగ్రెస్‌లో ఒకటే పవర్ సెంటర్
ABN , Publish Date - Sep 16 , 2024 | 03:28 AM
కాంగ్రెస్‌లో ఒక్కటే పవర్ సెంటర్ అని, అది రాహులేనని టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లోనూ పవర్ సెంటర్ లేదన్నారు.
అది రాహుల్‌గాంధీ మాత్రమే: మహేశ్‌కుమార్ గౌడ్
టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ
నేడు సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహావిష్కరణ
సీఎం రేవంత్ చేతుల మీదుగా కార్యక్రమం
పాల్గొననున్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నేతలు
కాంగ్రె్‌సలో రాహుల్ ఒక్కరే పవర్ సెంటర్: మహేశ్‌కుమార్‌గౌడ్
కాంగ్రెస్‌లో ఒక్కటే పవర్ సెంటర్ అని, అది రాహులేనని టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లోనూ పవర్ సెంటర్ లేదన్నారు. తనకు భేషజాలు లేవని, టీపీసీసీ అధ్యక్షుడినైౖనా.. కార్యకర్తగానే ఉంటానని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి, కార్యకర్తలకు వారధిగా వ్యవహరిస్తానని, ఏ విషయమైనా తనకు చెప్పుకోవచ్చని అన్నారు. కాంగ్రెస్‌లో ప్రజాస్వామిక స్వేచ్ఛ ఎక్కువ అని, రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడైన కొత్తలో సీనియర్ నాయకులందరినీ తాను సమన్వయం చేయాల్సి వచ్చిందని గుర్తు చేశారు.
అయితే ఆ తర్వాత విభేధాలు పక్కన పెట్టి అందరూ కలిసి తిరగడంతో ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని తెలిపారు. ప్రభుత్వం వచ్చాక సీనియర్ నాయకులంతా ఒక్కటయ్యారని, తనకు సమన్వయం చేయాల్సిన అవసరం లేకుండా పోయిందని చమత్కరించారు. తన స్థాయికి.. పీసీసీ అధ్యక్షుడిని అవుతాననుకోలేదని మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. రాజకీయాల్లో ఎంత కష్టపడ్డా ఒక శాతం అదృష్టం కూడా ఉండాలని, ఆ అదృష్టంతోనే తనకు పదవి దక్కిందన్నారు. కాంగ్రెస్ పథకాలను కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు.