Share News

Manda Krishnamadiga: మాదిగలకు కాంగ్రెస్‌ వెన్నుపోటు పొడిచింది..

ABN , Publish Date - Jun 21 , 2024 | 10:27 AM

మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్‌ పార్టీ వెన్నుపోటు పొడిచిందని, రేవంత్‌రెడ్డి వల్ల మాదిగలను, బీసీలను కాంగ్రెస్‌ పార్టీ దూరం చేసుకున్నదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ(Manda Krishnamadiga) ఆరోపించారు.

Manda Krishnamadiga: మాదిగలకు కాంగ్రెస్‌ వెన్నుపోటు పొడిచింది..

- జూలై 7న వరంగల్‌లో మాదిగల ఆత్మగౌరవ కవాతు

- మంద కృష్ణమాదిగ

హైదరాబాద్: మాదిగ సామాజిక వర్గానికి కాంగ్రెస్‌ పార్టీ వెన్నుపోటు పొడిచిందని, రేవంత్‌రెడ్డి(Revanth Reddy) వల్ల మాదిగలను, బీసీలను కాంగ్రెస్‌ పార్టీ దూరం చేసుకున్నదని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ(Manda Krishnamadiga) ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ జరిగి, రిజర్వేషన్లు పెంచిన తరువాతే ఉద్యోగ నియామకాలను చేపట్టాలని, స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మార్పీఎస్‌ చేపట్టిన ఎస్సీ వర్గీకరణ ఉద్యమం 30 ఏళ్ల ప్రస్థానానికి చేరుతున్న సందర్భంగా జూలై 7న వరంగల్‌లో మాదిగల ఆత్మగౌరవ కవాతును నిర్వహిస్తున్నామని తెలిపారు.

ఇదికూడా చదవండి: Balkampeta Ellamma: 9న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం..


తమ మద్దతు వల్లే బీజేపీ ఓటు శాతం 21 శాతానికి పెరిగిందని, బీజేపీ ఓటు బ్యాంక్‌ పెరగడానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించింది రేవంత్‌రెడ్డేనని అన్నారు. తెలంగాణలో ఒక్క మాదిగ ఎంపీ లేకుండా చేసిన రేవంత్‌రెడ్డి కచ్చితంగా గుణపాఠం నేర్చుకునేలా చేస్తామని అన్నారు. ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పెంచేవరకు ఏ నియామకాలను కూడా చేపట్టవద్దని, స్థానిక ఎన్నికలను కూడా వాయిదా వేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్‌ మాదిగ, ఎంఎస్‌ఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు చిప్పలపల్లి సోమశేఖర్‌ మాదిగ, బి.విజయ్‌ మాదిగ, నరసింహ మాదిగ, లక్ష్మణ్‌ మాదిగ తదితరులు పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 21 , 2024 | 10:27 AM