Mandakrishna Madiga: లక్ష డప్పులు.. వెయ్యి గొంతులతో దండోరా ప్రదర్శన
ABN , Publish Date - Dec 13 , 2024 | 09:37 AM
వర్గీకరణ సాధించే దిశగా తుది ఘట్టంగా జనవరి 27న హైదరాబాద్‌లో లక్ష డప్పులు, వెయ్యి మంది కళాకారుల గొంతులతో దండోరా ప్రదర్శన, సభ ఉంటుందని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Manda krishna Madiga) ప్రకటించారు.
- జనవరి 27న నిర్వహిస్తాం
- మాదిగ కళాకారుల పట్ల ప్రభుత్వం వివక్ష
- ఎమ్మార్పీస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ
హైదరాబాద్: వర్గీకరణ సాధించే దిశగా తుది ఘట్టంగా జనవరి 27న హైదరాబాద్‌లో లక్ష డప్పులు, వెయ్యి మంది కళాకారుల గొంతులతో దండోరా ప్రదర్శన, సభ ఉంటుందని ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Manda krishna Madiga) ప్రకటించారు. గురువారం సోమాజిగుడ ప్రెస్‌క్లబ్‌లో మాదిగ కళాకారులతో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మారణాయుధాలతో బెదిరించి.. నగల వ్యాపారి ఇంట్లో భారీ చోరీ
తెలంగాణ ప్రభు త్వం 9 మంది కళాకారులను గుర్తించి వారికి కోటి రూపాయల నగదు, తామ్ర పత్రం, 300 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్టు ప్రకటించడం సంతోకరమే అయినా ..వారిలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు లేకపోవడం తమను వివక్షకు గురి చేయడమేనని అన్నారు. అందెశ్రీని కొందరు మాదిగ అని ప్రచారం చేస్తున్నారని, అయితే, తాను విశ్వనరుడనని ఆయన పేర్కొన్నారని, మాదిగనని ఎప్పుడు చెప్పలేదని అన్నారు. కళాకారుల ఎంపిక విషయంపై ప్రభుత్వం పునఃపరిశీలించి మాదిగ కళాకారులను గుర్తించాలని కోరారు.
తెలంగాణ ప్రముఖుల్లో తెలంగాణ కోసం త్యాగం చేసిన వారిని విస్మరించారని, శిల్పి యాదగిరిరావును శాసన మండలికి పంపాలని డిమాండ్ చేశారు. కళాకారులు, ప్రముఖుల్లో మహిళలకు తగు ప్రాధాన్యమివ్వాలని, తెలంగాణ ఉద్యమాన్ని చెన్నారెడ్డి అనంతరం నడిపించిన టీఎన్ సదాలక్ష్మితో పాటు చాకలి ఐలమ్మ, కేశవరావు జాదవ్, విమలక్కలను ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. ఎస్సీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న మాల కులస్తులు సమాజంలో ఒంటరయ్యారన్నారు. డిసెంబరు 27 నుంచి అన్ని జిల్లాల్లో రథయాత్రలు నిర్వహించి దండోరా సభకు లక్ష డప్పులతో మాదిగలు వచ్చేలా చేస్తామన్నారు. ఈ ప్రదర్శన, సభకు మాదిగ కళాకారులు ప్రజా యుద్ధ్దనౌక ఏపూరి సోమన్న అధ్యక్షత వహిస్తారన్నారు.
బహుజనుల తెలంగాణ తల్లిని ప్రతిష్ఠిస్తాం
తెలంగాణ తల్లులుగా కేసీఆర్, రేవంత్‌రెడ్డి(KCR, Revanth Reddy)లు పెట్టిన విగ్రహాలను తాము అంగీకరించబోమని, తాము అధికారంలోకి వస్తే చాకలి ఐలమ్మ రూపంలో ఉండే బహుజనుల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటామని మందకృష్ణ మాదిగ అన్నారు. సమావేశంలో మాదిగ కళాకారులు ఏపూరి సోమన్న, ఎన్‌ఐ అశోక్, ఎంఆర్‌పిఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ, కళాకారులు గిద్దె రాంనర్సయ్య, భరత్, మల్లెపాక అనిల్, గజ్జల అశోక్, డప్పు రమేష్ పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Seethakka: చర్యలు తీసుకున్నా మీరు మారరా ?
ఈవార్తను కూడా చదవండి: సీఎం సారూ.. రుణమాఫీ చేసి ఆదుకోండి!
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ సంస్కృతిపై దాడి : బండి సంజయ్
ఈవార్తను కూడా చదవండి: అక్కా.. నేను చనిపోతున్నా
Read Latest Telangana News and National News