Manuguru: నాడు అటెండర్.. నేడు ఆరు మండలాలకు అధికారి
ABN , Publish Date - Nov 05 , 2024 | 03:34 PM
ఒకప్పుడు అధికారులు చెప్పిన పనులు చేయడం ఆయన విధి. రోజు వారి కూలీగా పనిచేసే ఆఫీసు బాయ్ ఆయన నేడు ఆరు మండలాలకు ఓ బాధ్యత గల ఉన్నతాధికారిగా ఎదిగాడు. ఆయనే మణుగూరు అసిస్టెంట్ లేబర్ అధికారి బండి నాగరాజు(Bandi Nagaraju).
- అటెండర్ నుంచి అసిస్టెంట్ లేబర్ అధికారిగా ఎదిగిన నాగరాజు
మణుగూరు(భద్రాద్రి కొత్తగూడెం): ఒకప్పుడు అధికారులు చెప్పిన పనులు చేయడం ఆయన విధి. రోజు వారి కూలీగా పనిచేసే ఆఫీసు బాయ్ ఆయన నేడు ఆరు మండలాలకు ఓ బాధ్యత గల ఉన్నతాధికారిగా ఎదిగాడు. ఆయనే మణుగూరు అసిస్టెంట్ లేబర్ అధికారి బండి నాగరాజు(Bandi Nagaraju). తండ్రి కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఉద్యోగ కాలంలో మరణించడంతో కారుణ్య పథకం కింద 1996 జనవరిలో నాగరాజు అటెండర్‌గా ఖమ్మం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయంలో 10వ తరగతి అర్హతతో ఉద్యోగ విధుల్లో చేరాడు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: గాంధీ అంటే గౌరవమే.. తప్పయింది క్షమించండి
ఉద్యోగం చేస్తూ 2003లో ఇంటర్ పాస్ అయ్యాడు. అప్పటి నుంచి 2016వరకు ఖమ్మంలోని అసిస్టెంట్ లేబర్ ఆఫీసులో పనిచేస్తూ డిగ్రీ పట్టా పొందాడు. 2016 నుంచి 2021 వరకు మహబాబాబాద్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగ విధులు నిర్వహించారు. 2021లో అసిస్టెంట్ లేబర్ అధికారిగా పదోన్నతి పొంది మణుగూరులో పనిచేస్తున్నారు. పాల్వంచ, మణుగూరు, బూర్గంపాడ్, అశ్వాపురం, కరకగూడెం, పినపాక మండలాలకు అసిస్టెంట్ లేబర్ అధికారి(Assistant Labor Officer)గా పనిచేస్తున్నారు.
ఆయన మణుగూరులో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కార్యాలయమే స్వర్గంగా.. కార్మికులే ప్రాణంగా ఈ అధికారి విధులు పట్ల బాధ్యత కలిగి పనిచేస్తున్నారు. కార్మికులకు సేవలందించడంలో అహర్నిశలు శ్రమిస్తూ ఓ మంచి అధికారిగా గుర్తింపు పొందా రు. బాల కార్మిక సంక్షేమ చట్టాలు అమలు పరచడంలో ఈయన చిత్తశుద్ధితో పనిచేస్తుంటారు. బాలకార్మిక సంక్షేమ పథకాలు, ముస్కాన్ స్మైల్ వంటి పదకాల పట్ల బాలలకు అవగాహన కల్పిస్తున్నారు. బాలలను వేధించడం, బాలకార్మికులతో వెట్టి పని చేయిస్తున్న అనేక యాజమాన్యాలపై ఎన్నో కేసులు పెట్టారు.
ప్రైవేటు సంస్థల్లో బాల కార్మికుల అన్యాయాలపై అధికారి విచారణలు చేసి యాజమాన్యాల ద్వారా వారి సంక్షేమాలు అందేలా చేశారు. 1986బాల కార్మిక చట్టం ప్రకారం 9మంది యజమానులపై 20వేల చొప్పున జరిమానా వసూలు చేయించారు. 1996 భవన నిర్మాణ కార్మిక చట్టం ప్రకారం కార్మికులకు న్యాయం అందజేస్తున్నారు. యాజమాన్యాల ద్వారా మహిళా కార్మికులు మెటర్నటీ అలవెన్సులను ఇప్పించారు. అటెండర్‌గా పనిచేసిన నాగరాజు వివిధ కార్యాలయాల్లో అధికారిగా ఎదగాలని కలలు కనేవారు. ఆ కోరిక అతనిలో మళ్లీ చదువుకోవాలన్నా ఆసక్తిని పెంచింది. ఉధ్యోగ భాధ్యతను నిర్వహిస్తూనే అదనపు విద్యార్హతలను సాధించి లేబర్ ఆఫీసర్ అయ్యారు.
ఈవార్తను కూడా చదవండి: మినరల్ కాదు.. జనరల్ వాటరే
ఈవార్తను కూడా చదవండి: 24 గంటల విద్యుత్ అంటూ మోసం: హరీశ్‌రావు
ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్, హరీశ్ ఇళ్ల ముందు ధర్నా చేయండి
ఈవార్తను కూడా చదవండి: అసంక్రమిత వ్యాధులకు ప్రత్యేక క్లినిక్‌లు
Read Latest Telangana News and National News