Mulugu: 9న రాష్ట్ర బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపు
ABN , Publish Date - Dec 06 , 2024 | 03:56 AM
ములుగుజిల్లా చల్పాక అడవుల్లో ఈ నెల 1న జరిగిన ఎన్‌కౌంటర్ కు నిరసనగా ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.
హైదరాబాద్, ఏటూరునాగారం, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): ములుగుజిల్లా చల్పాక అడవుల్లో ఈ నెల 1న జరిగిన ఎన్‌కౌంటర్ కు నిరసనగా ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ ఎన్‌కౌంటర్ బూటకమని, ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఏడుగురు విప్లవకారులకు విషమిచ్చి పోలీసులు అతి కిరాతంగా చంపారని పార్టీ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఘటనపై న్యాయవిచారణ జరిపి బాధ్యులైన పోలీసులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.