Share News

Maoists: జీడిపల్లి క్యాంప్‌పై మళ్లీ మావోయిస్టుల దాడి

ABN , Publish Date - Dec 09 , 2024 | 04:22 AM

ఛత్తీ్‌సగఢ్‌లో మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. బీజాపూర్‌ జిల్లా పామేడు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని జీడిపల్లి రెండో పోలీస్‌ క్యాంప్‌పై శనివారం అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.

Maoists: జీడిపల్లి క్యాంప్‌పై మళ్లీ మావోయిస్టుల దాడి

  • మూడు రోజుల్లో రెండోసారి.. బీజీఎల్స్‌తో కాల్పులు.. గాయపడ్డ ముగ్గురు జవాన్లు

  • బీజాపూర్‌లో ఇన్‌ఫార్మర్‌ నెపంతో మహిళ హత్య

చర్ల, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి) : ఛత్తీ్‌సగఢ్‌లో మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. బీజాపూర్‌ జిల్లా పామేడు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని జీడిపల్లి రెండో పోలీస్‌ క్యాంప్‌పై శనివారం అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు. నాలుగు రోజుల వ్యవధిలో రెండోసారి మావోయిస్టులు ఈ క్యాంపుపై దాడి చేయడం గమనార్హం. జీడిపల్లిలో సీఆర్‌పీఎ్‌ఫ-228కి చెందిన రెండు క్యాంపు లు ఏర్పాటు చేశారు. వీటిలో రెండో క్యాంప్‌పై గత గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. శనివారం అర్ధరాత్రి అదే క్యాంప్‌పై మావోయిస్టులు మళ్లీ కాల్పులు జరిపారు.


సుమారు5 గంటల పాటు బీజీఎల్స్‌తో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు డీఆర్‌జీ జవాన్లు గాయపడ్డారు. కాగా, ఈ రెండు దాడుల ఘటనల్లో మావోయిస్టు పార్టీ పీఎల్‌జీఏ మొదటి బెటాలియన్‌ నాయకుడు మాద్వి హిడ్మా హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. పథకం ప్రకారం పోలీసు బలగాలను అడవుల్లోకి రప్పించేందుకే ఇలా కాల్పులు జరుపుతూ కవ్విస్తున్నట్లు బలగాలు అనుమానిస్తున్నాయి. మరోవైపు ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా మద్దేడు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని లోడెడ్‌ గ్రామానికి చెందిన సుక్ర(40) అనే మహిళను ఆదివారం మావోయిస్టులు హత్య చేశారు. తెలంగాణ పోలీసులకు ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నందుకే ఈ హత్య చేసినట్లు మృతదేహం వద్ద మావోయిస్టులు లేఖ వదిలారు.


  • నేడు తెలంగాణ బంద్‌కు పిలుపు

ఏటూరు నాగారం మండలం చెల్పాక అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌కు నిరసనగా తెలంగాణ మావోయిస్టు పార్టీ 9వ తేదీ సోమవారం రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు.

Updated Date - Dec 09 , 2024 | 04:22 AM