Share News

Yadagirigutta: కొండపై కోలాహలం

ABN , Publish Date - Nov 25 , 2024 | 03:39 AM

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కార్తీక మాసానికి తోడు సెలవు రోజూ కావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు.

Yadagirigutta: కొండపై కోలాహలం

  • యాదగిరిగుట్టకు పోటెత్తిన జనం

భువనగిరి అర్బన్‌, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దర్శనానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కార్తీక మాసానికి తోడు సెలవు రోజూ కావడంతో ఇష్టదైవాలను దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సుమారు 66వేల మంది క్షేత్ర దర్శనానికి వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ప్రత్యేక, ఉచిత దర్శన క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి.


కొండకింద వ్రత మండపాల్లో 1,547 జంటలు సత్యనారాయణ వ్రతాలను నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రత్యేక దర్శనాలకు గంటన్నర, ధర్మదర్శనాలకు మూడు గంటల సమయం పట్టినట్లు భక్తులు చెప్పారు. కాగా, ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.79,70,843 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో భాస్కర్‌రావు తెలిపారు.

Updated Date - Nov 25 , 2024 | 03:39 AM