Telangana: డిప్యూటీ తహసీల్దార్ అసభ్య చేష్టలు
ABN , Publish Date - Apr 19 , 2024 | 10:08 AM
తాను అద్దెకు ఉంటున్న భవనంలోని మరో పోర్షన్‌లో అద్దెకు ఉంటున్న వివాహిత పట్ల ఓ ప్రభుత్వ అధికారి(Government Employee) కొన్నాళ్లుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. అతడిని ఆమె గట్టిగా హెచ్చరించినా బుద్ధి మార్చుకోకపోగా మరింత రెచ్చిపోయి అసభ్యకరంగా సైగలు చేశాడు. విషయాన్ని బాధితురాలు తన భర్తకు..
కొన్నాళ్లుగా వివాహితకు దురుద్దేశంతో కూడిన సైగలు
చేయి పట్టుకున్న వైనం.. ప్రశ్నించిన భర్తపై దాడి
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌లో ఘటన.. కేసు నమోదు
నారాయణఖేడ్, ఏప్రిల్ 19: తాను అద్దెకు ఉంటున్న భవనంలోని మరో పోర్షన్‌లో అద్దెకు ఉంటున్న వివాహిత పట్ల ఓ ప్రభుత్వ అధికారి(Government Employee) కొన్నాళ్లుగా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. అతడిని ఆమె గట్టిగా హెచ్చరించినా బుద్ధి మార్చుకోకపోగా మరింత రెచ్చిపోయి అసభ్యకరంగా సైగలు చేశాడు. విషయాన్ని బాధితురాలు తన భర్తకు చెప్పడంతో వెళ్లి ప్రశ్నించగా ఆయనపై దాడి చేశాడు. సంగారెడ్డి(Sangareddy) జిల్లా నారాయణఖేడ్(Narayankhed) ఆర్డీవో కార్యాలయం(RDO Office) ఎన్నికల విభాగంలో పనిచేస్తున్న ఎస్.రాజు అనే డిప్యూటీ తహసీల్దార్‌దీ దుర్మార్గం. ఈ ఘటనపై గురువారం ఎస్సై విద్యాచరణ్ రెడ్డి వివరాలు వెల్లడించారు.
డిప్యూటీ తహసీల్దార్ రాజు నారాయణఖేడ్‌లో ఓ భవనంలో అద్దెకు ఉంటున్నాడు. అదే ఇంట్లో కింది అంతస్తులో ఓ వివాహిత (31) తన కుటుంబంతో కలిసి ఉంటోంది. కొన్నాళ్లుగా రాజు, ఆమెను చూస్తూ అసభ్యకరంగా సైగలు చేస్తున్నాడు. ఒకసారి టిఫిన్ ప్లేట్ తిరిగిచ్చే నెపంతో నేరుగా ఇంటి లోపలికి రావడంతో అతడిని ఆమె గట్టిగా మందలించింది. బుధవారం రాత్రి 7 గంటలకు బాధితురాలు, దుస్తులు ఆరవేసేందుకు దాబాపైకి వెళ్లగా అక్కడే ఉన్న రాజు, ఆమెను ఉద్దేశించి అసభ్యకరంగా కామెంట్ చేశాడు. పైగా ఆమెను చూస్తూ ఫోన్‌తో వీడియో తీస్తున్నట్లు చేశాడు. అనుమానించిన ఆమె, ఫోన్ ఇవ్వాలని గద్దించగా ఫొటో గ్యాలరీ లాక్ తీయకుండా ఇచ్చాడు. ఆగ్రహించిన బాధితురాలు, ఫోన్‌ను భర్తకు ఇస్తానని హెచ్చరించడంతో మొబైల్‌ను లాక్కునే నెపంతో ఆమె చేయి పట్టుకున్నాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన భర్తకు చెప్పింది. ఆయనొచ్చి ప్రశ్నించగా రాజు ఆయనపై దాడి చేశాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు డిప్యూటీ తహసీల్దార్ రాజుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.
ఇవికూడా చదవండి:
టికెట్ ఇస్తే బీజేపీలోకి వచ్చేస్తా..