Harishrao: సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యను తీర్చాల్సిందే..
ABN , Publish Date - Dec 25 , 2024 | 04:55 PM
Telangana: సమగ్ర శిక్ష ఉద్యోగుల టెంట్ల ముందు నుంచే వెళ్తున్న ముఖ్యమంత్రి.. టెంట్లు పీకేయడం కాదు, వారి సమస్యకు పరిష్కారం చూపాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. 15 రోజులుగా ఆందోళన చేస్తున్న వారి ఆవేదన అర్థం చేసుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తామని,
మెదక్, డిసెంబర్ 25: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) జిల్లా పర్యటన సందర్భంగా సమగ్ర శిక్ష ఉద్యోగులను నిర్బంధించడం పట్ల మాజీ మంత్రి హరీష్‌రావు (Former Minister harish Rao) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఎన్నికల సమయంలో తమకు ఇచ్చిన హామిని రేవంత్ రెడ్డి నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ మెదక్ పట్టణంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను పోలీసుస్టేషన్ తరలించి, నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల టెంట్ల ముందు నుంచే వెళ్తున్న ముఖ్యమంత్రి.. టెంట్లు పీకేయడం కాదు, వారి సమస్యకు పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. 15 రోజులుగా ఆందోళన చేస్తున్న వారి ఆవేదన అర్థం చేసుకోవాలన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తామని, వారి ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి, ఏడాది గడిచినా ఉలుకు లేదు, పలుకు లేదు అంటూ విమర్శలు గుప్పించారు.
అన్ని వర్గాలను మోసం చేస్తున్న విధంగానే సమగ్ర శిక్ష ఉద్యోగులను కూడా కాంగ్రెస్ పార్టీ నమ్మించి మోసం చేశారన్నారు. ఇప్పుడు రోడ్డెక్కి నిలదీస్తే అక్రమ నిర్బంధాలకు గురిచేస్తున్నారని... ఇది హేయమైన చర్య అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్బంధించిన సమగ్ర శిక్ష ఉద్యోగులను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో చెప్పినట్లుగా రెగ్యులైరైజేషన్ సహా ఇతర హామీలను నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని మాజీ మంత్రి హరీష్ రావు పోస్టు చేశారు.
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
క్రిస్మస్ వేడుకల్లో...
కాగా.. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సిద్ధిపేట జిల్లా సీఎస్‌ఐ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మాజీ మంత్రి పాల్గొన్నారు. కులం ఏదైనా, మతం ఏదైనా, దేశం ఏదైనా అందరూ సమానులే అని అన్నారు. తోటివారిని ప్రేమించి, వారికి సహాయం చేయడంతోనే జన్మధన్యమవుతుందని ఏసు బోధనల సారాంశమని తెలిపారు. డిసెంబర్ మాసం వచ్చిందంటేనే ఏసుక్రీస్తు పుట్టిన నెల కావడంతో ఎనలేని ఉత్సాహం అందరిలో కనబడుతుందన్నారు. ఈ క్రిస్మస్ అందరికీ కూడా శాంతి, సౌభ్రాతృత్వం, సహనం, క్షమాగుణం, ఎదుటి వారి పట్ల జాలి, దయ కలిగి ఉండాలని కోరుకుంటున్నాట్లు తెలిపారు. ప్రపంచంలోనే అతి ఎక్కువ మంది జరుపుకునే పండుగ క్రిస్మస్ అని హరీష్ రావు తెలిపారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం
Read Latest Telangana News And Telugu News