Ponnam Prabhakar: కిషన్‌రెడ్డి కేంద్రమంత్రి పదవికి అర్హుడా..
ABN , Publish Date - Nov 15 , 2024 | 03:57 PM
Telangana: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులు నిరసన తెలపడంలో తప్పులేదని.. కానీ అధికారులపై దాడి చేయడం తప్పన్నారు. కలెక్టర్‌ను కొట్టే ధైర్యం వీరికి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారు. పైనున్న నాయకుల ప్రోత్సాహం వల్లనే కదా అని ప్రశ్నించారు.
సిద్దిపేట, నవంబర్ 15: వికారాబాద్ కలెక్టర్‌ను కొట్టడం తప్పే అంటున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అరెస్టులు చేయొద్దంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అన్నారు. శుక్రవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. కలెక్టర్‌ను కొట్టినా అరెస్టులు వద్దంటున్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవికి అర్హుడా అని ప్రశ్నించారు. బాధితులు నిరసన తెలపడంలో తప్పులేదని.. కానీ అధికారులపై దాడి చేయడం తప్పన్నారు. కలెక్టర్‌ను కొట్టే ధైర్యం వీరికి ఎక్కడి నుంచి వచ్చిందని అడిగారు. పైనున్న నాయకుల ప్రోత్సాహం వల్లనే కదా అని ప్రశ్నించారు.
CM Chandrababu: అనుకున్న దానికన్నా ఎక్కువే విధ్వంసం
రాష్ట్రంలో ఇప్పటి వరకు 35 శాతం కుటుంబ సర్వే పూర్తయిందని తెలిపారు. కోటి 16 లక్షల ఇండ్లను 87 వేల మంది ఎన్యుమరేటర్లతో సర్వే చేయిస్తున్నామన్నారు. ఎన్యుమరేటర్లు తమ ఐడీ కార్డుతో పరిచయం చేసుకోవాలని.. దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు ఉంటాయని తెలిపారు. మేడ్చల్ వద్ద రోడ్డుపై సర్వే పెపర్లపై సమాచారం లేదని.. అలాంటిది జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సర్వేపై ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేయడానికి సోషల్ మీడియా వేదికగా విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
AP Assembly: బడ్జెట్‌పై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆసక్తికర చర్చ
500 బోనస్ ఇచ్చి తీరుతాం
కాగా.. కొండపాక మండలం దుద్దేడ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పొన్నం సందర్శించి, సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్న రైతులు అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. సన్న వడ్లు పండించిన రైతులకు గిట్టుబాటు ధరతో పాటు 500 బోనస్ ఇవ్వడం జరుగుతుందని.. కానీ ప్రతిపక్ష పార్టీల నాయకులు రాద్ధతం చేయకుండా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
జిల్లా కో సీనియర్ అధికారి నియమించి ధాన్యం కొనుగోలను పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. కాళేశ్వరం లేకున్నా కాళేశ్వరం ద్వారా పంటలు పండాయి అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు.. కానీ రాష్ట్రంలో అత్యధికంగా పంటలు పండాయని తెలిపారు. రైస్ మిల్లర్ల విషయంలో ఎక్కడ ఇబ్బంది లేదన్నారు. 20 మంది డిఫల్టర్‌లు ప్రభుత్వ బకాయిలు చెల్లించి కొనుగోలులో పాల్గొనాలని తెలిపారు. 101 మంది రైస్ మిల్లర్లు ఉన్నారని.. వారు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Viral News: 2050కి కోటి రూపాయల విలువ ఎంత.. ఏఐ సమాధానం తెలిస్తే షాక్..
Caste Census: అధికారుల వద్ద ఉండాల్సిన కులగణన పత్రాలు.. ఎక్కడున్నాయో చూడండి
Read Latest Telangana News And Telugu News