Share News

Medak: మెదక్ చర్చిని సందర్శించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ..

ABN , Publish Date - Dec 22 , 2024 | 05:34 PM

తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మెదక్ జిల్లాలో పర్యటించారు. మెదక్ చర్చి ప్రారంభమై 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం నుంచి వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో మెదక్ చర్చిని గవర్నర్ సందర్శించారు.

Medak: మెదక్ చర్చిని సందర్శించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ..
Telangana Governor Jishnu Dev Verma

మెదక్: తెలంగాణ(Telangana) గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Verma) మెదక్ జిల్లాలో పర్యటించారు. మెదక్ చర్చి (Medak Church) ప్రారంభమై 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం నుంచి వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో మెదక్ చర్చిని గవర్నర్ సందర్శించారు. చర్చిని మెుత్తాన్ని కలియ తిరిగిన జిష్ణుదేవ్ వర్మ అక్కడ జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు.


అనంతరం యేసుక్రీస్తు, చర్చిని ఉద్దేశించి ప్రసంగించారు. ఆ తర్వాత అక్కడ్నుంచి కొల్చారం సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలకు చేరుకున్నారు. గవర్నర్‌కి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఘనస్వాగతం పలికారు. పాఠశాలకు చేరుకున్న జిష్ణుదేవ్ వర్మ అక్కడ విద్యార్థులను కలిసి ముచ్చటించారు. ఆహారం, వసతి సహా పలు అంశాలపై ఆరా తీశారు. అనంతరం విద్యార్థులతో కలిసి గవర్నర్ భోజనం చేశారు.


ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ.. "శతాబ్ది ఉత్సవాల సందర్భంగా మెదక్ చర్చిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. చర్చి వందేళ్లు పూర్తి చేసుకోవడం చాలా గొప్ప విషయం. యేసుక్రీస్తు ప్రేమను ఈ చర్చి వందేళ్లుగా పంచుతోంది. జీసస్ ఏ విధంగా మనల్ని ప్రేమిస్తాడో, అదే విధంగా మనం ఇతరులను ప్రేమించాలి. బాలికలకు రెసిడెన్షియల్ స్కూల్స్ బంగారు భవిష్యత్‌ ఇవ్వాలని మనసారా కోరుతున్నా. మంచి సంస్కృతి, సంప్రదాయాలతో విద్యార్థులు సమాజంలో ఎదగాలి. కలలు సాకారం చేసుకునేందుకు నిరంతరం శ్రమించాలి. క్రీడలలో బ్యాడ్మింటన్ క్రీడ అంటే నాకు చాలా ఇష్టం. నాకు భారత మాజీ ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శం. దేశ భవిష్యత్తుకు మీరు పునాదిలాంటి వారు. సమస్యలను అధిగమిస్తూ లక్ష్యాలను సాధించాలి. విద్యాలయాలు దేవాలయాలతో సమానం. విద్యార్థులు చిన్నతనం నుంచే క్రమశిక్షణతో మెసుగుతూ అభివృద్ధిలోకి రావాలి. మంచి ప్రవర్తనతో చిన్నారులు భవిష్యత్‌కు మార్గనిర్దేశం చేసుకోవాలని" చెప్పారు.


కాగా, మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈనెల 25న క్రిస్మస్ సందర్భంగా జరిగే వేడుకల్లో ముఖ్యమంత్రి పాల్గొనున్నారు. ఆదివారం నుంచే వందేళ్ల పండగ ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి చర్చికి పెద్దఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఈనెల 23న సోమవారం నాడు చర్చి ఆవరణలో ప్రత్యేక కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకల్లో జీసస్ జన్మ వృత్తాంతాన్ని తెలిపే నాటక ప్రదర్శనలు, ప్రత్యేక ప్రార్థనలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Allu Arjun: అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. జూబ్లీహిల్స్‌లో టెన్షన్ టెన్షన్..

Pushpa 2: ఈ వీడియో చూస్తే కనీస జ్ఞానం ఉన్నవాళ్లకు ఏం జరిగిందో తెలుస్తుంది.. అల్లు అర్జున్ ఎపిసోడ్‌పై సీపీ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Dec 22 , 2024 | 05:41 PM