Big Alert: హైదరాబాదీలకు బిగ్ అలర్ట్.. మెట్రో రైలు వేళలు మారిపోయాయ్..
ABN , Publish Date - May 18 , 2024 | 09:58 AM
ట్రాఫిక్ నుంచి విముక్తి కోసం ఇప్పుడు ప్రతి ఒక్కరూ మెట్రోను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్‌లో మెట్రో రైలు సదుపాయం అందుబాటులోకి వచ్చినప్పుడు ఎవరూ పెద్దగా ఎక్కేవారు కాదు. దీంతో నష్టాల బాటలో నడిచేది. ఆ తరువాత క్రమక్రమంగా పుంజుకుంది. జంట నగరాల్లో ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తికి మెట్రో ఒక్కటే పరిష్కార మార్గంగా కనిపించింది. దీంతో మెట్రో రైలుకు జనాలు అలవాటు పడ్డారు.
హైదరాబాద్: ట్రాఫిక్ నుంచి విముక్తి కోసం ఇప్పుడు ప్రతి ఒక్కరూ మెట్రోను ఆశ్రయిస్తున్నారు. హైదరాబాద్‌లో మెట్రో రైలు సదుపాయం అందుబాటులోకి వచ్చినప్పుడు ఎవరూ పెద్దగా ఎక్కేవారు కాదు. దీంతో నష్టాల బాటలో నడిచేది. ఆ తరువాత క్రమక్రమంగా పుంజుకుంది. జంట నగరాల్లో ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తికి మెట్రో ఒక్కటే పరిష్కార మార్గంగా కనిపించింది. దీంతో మెట్రో రైలుకు జనాలు అలవాటు పడ్డారు. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ సిబ్బందితో పాటు జంట నగరాల్లో పని చేసే ఉద్యోగులంతా మెట్రోలోనే ప్రయాణిస్తున్నారు. వారితో పాటు దాదాపుగా హైదరాబాద్ వాసులంతా మెల్లమెల్లగా మెట్రోకు అలవాటు పడిపోయారు.
AP News: వాన పడింది.. వజ్రాల వేట మొదలైంది..
జంట నగర వాసులందరికీ బిగ్ అలర్ట్. మెట్రో రైలు వేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు ఉండగా.. ఇక నుంచి 11.45 గంటలకు చివరి రైలు అందుబాటులో ఉండనుంది. ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకే మెట్రో రాకపోకలు మొదలు కానున్నాయి. మిగతా రోజుల్లో మాత్రం సాధారణంగానే ఉదయం 6 గంటల నుంచే మెట్రో పరుగులు పెట్టనుంది. రద్దీ పెరిగిన దృష్ట్యా ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో వేళల్లో అధికారులు మార్పులు చేశారు. పొడిగించిన వేళలు శుక్రవారం రాత్రి నుంచి అమల్లోకి వస్తాయని మెట్రో అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Jagan : లగ్జరీ ఫ్లైట్‌లో పేదింటి బిడ్డ!
Read more Telagana News and Telugu News