Minister: నార్సింగ్‌లో ఆధునిక వ్యవసాయ మార్కెట్..
ABN , Publish Date - Dec 12 , 2024 | 07:36 AM
నార్సింగ్ మార్కెట్ యార్డులో సకల సదుపాయాలతో ఆధునిక వ్యవసాయ మార్కెట్ నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. బుధవారం నార్సింగ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు.
- పాలకవర్గం సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్: నార్సింగ్ మార్కెట్ యార్డులో సకల సదుపాయాలతో ఆధునిక వ్యవసాయ మార్కెట్ నిర్మిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. బుధవారం నార్సింగ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరై చైర్మన్ కోట వేణుగౌడ్‌తో పాటు 12 మంది సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఆలయంలో పాదం గుర్తు.. పూజలు చేసిన భక్తులు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఐటీతో పాటు నగరం విస్తీర్ణంలో భాగంగా నార్సింగ్ ప్రాంతం బాగా అభివృద్ధి చెందిందని, అందుకే ఈ ప్రాంతంలో ఉన్న పశువుల మార్కెట్‌కు అనుసంధానంగా కూరగాయల మార్కెట్, నాన్‌వెజ్ మార్కెట్, పూల మార్కెట్ నిర్మిస్తామని తెలిపారు. ప్రభుత్వ నర్సరీ కూడా ఏర్పాటు చేసి పిల్లలు మొక్కలు, రూఫ్‌గార్డెనింగ్, కూరగాయల పంటలు తదితర వాటిని పెంచేలా ప్రోత్సహిస్తామన్నారు.
రెండేళ్లలోపు ఇక్కడి ప్రజలు ఆధునిక మార్కెట్‌ను చూస్తారని, స్థానిక ఎమ్మెల్యే ప్రకా్‌షగౌడ్ ఈ విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్(MLA Prakash Goud) మాట్లాడుతూ నార్సింగ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పనుల కేటాయింపులో పారదర్శకత పాటించామని, అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని అన్నారు. పదవితో మనం సాధించినది ప్రజలకు చూపించాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, పీసీసీ అధికార ప్రతినిధి ముంగి జైపాల్‌రెడ్డి, గ్రంథాలయాల సంస్థల చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, నార్సింగ్ మున్సిపల్ చైర్మన్ నాగపూర్ణ, కాంగ్రెస్ పార్టీ గండిపేట మండల అధ్యక్షుడు క్యాతం అశోక్ యాదవ్‌తో పాటు పలువురు కౌన్సిలర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: Special Trains: శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు: ద.మ. రైల్వే
ఈవార్తను కూడా చదవండి: హాస్టల్ ఫుడ్ పాయిజన్ ఘటనల్లో.. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌పై అనుమానాలు
ఈవార్తను కూడా చదవండి: విద్యార్థుల సమస్యలు పట్టవా రేవంత్: కవిత
ఈవార్తను కూడా చదవండి: ఉత్తమ పార్లమెంటేరియన్ తరహాలో ఏటా ఉత్తమ లెజిస్లేచర్ అవార్డు
Read Latest Telangana News and National News