Telangana: దేశంలో అత్యధికంగా దోచుకున్న పార్టీ ఇదే.. మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Nov 17 , 2024 | 02:27 PM
కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకే వరంగల్ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వరంగల్ : బీఆర్ఎస్, బీజేపీకి రాజకీయ లబ్ది తప్ప వేరే ఆలోచన లేదని మంత్రి సీతక్క కామెంట్స్ చేశారు. అందుకే అధికారులపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము మంచి పనులు చేస్తే బీఆర్ఎస్ అడ్డుకుంటోందని మండిపడ్డారు. హైడ్రాకు అడ్డుపడుతున్నారని ఫైర్ అయ్యారు. మీరు చేసిన సకల జనుల సర్వే ఏమైంది...? అని ప్రశ్నించారు. లిమ్కా బుక్ రికార్డు కోసమే బీఆర్ఎస్ సకల జనుల సర్వే చేసిందని పేర్కొన్నారు. కానీ, తాము చేసే కులగణన ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందించడానికేనని వివరించారు.
తప్పుడు ప్రచారం..
దేశంలో అత్యధికంగా దోచుకున్న పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. బీఆర్ఎస్ పార్టీకే మూటలు ఇచ్చిన చరిత్ర ఉందని.. తమకు మూటలు మోసే అలవాటు లేదని కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వారు పోలీసులను మెచ్చుకుని... ఇప్పుడు తిడుతున్నారని అన్నారు. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకే వరంగల్ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
లక్ష్యం ఇదే..
ఉక్కు మహిళ ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ప్రగతి సభ నిర్వహిస్తున్నామన్నారు. మహిళలకు సంబంధించిన ప్రగతి నివేదిక వివరిస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ఆర్టీసీ బస్సులు కూడా మహిళలే నిర్వహించేలా సీఎం చర్యలు చేపడుతున్నారని తెలిపారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆరు గ్యారంటీల్లో... ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ పెంపు అమలు చేసినట్లు తెలిపారు.
Also Read:
అయ్యో దేవుడా.. తెల్లారితే నిశ్చితార్థం.. ఇంతలోనే ఘోరం..
వారి సమస్యలు రేవంత్ ప్రభుత్వానికి పట్టవా.. హరీష్‌రావు ధ్వజం
రాజధానిలో దారుణం.. ఐదో రోజు అదే వాయు కాలుష్యం, బతికేదేలా..
For More Telugu and National News