Home » Minister Seethakka
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్‌పై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మాత్రమే నక్సల్స్ ఉద్యమంలో పాల్గొన్నానని.. వరంగల్‌లో లాయర్‌గా పనిచేశానని గుర్తుచేశారు. తాను మూడు సార్లు ప్రజా ప్రతినిదిగా పనిచేశానని అన్నారు. బీజేపీ పార్టీలో ఉన్న ఎంపీ ఈటల రాజేందర్‌ది ఏ భావజాలమో బండి సంజయ్ తెలుసుకోవాలని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షల మంది దివ్యంగులు ఉన్నారు. వారి సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమం కోసం రూ.50 కోట్లను కేటాయించిందని అన్నారు.
ములుగు నియోజకవర్గంలో కొత్తగా మల్లంపల్లి మండలం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. మల్లంపల్లి మండలం ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన మాటను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క నిలబెట్టుకున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధిపై దృష్టి సారించారని మంత్రి కొండా సురేఖ అన్నారు. లగచర్ల ఘటన కలెక్టర్‌పై దాడి మాజీ మంత్రి కేటీఆర్ పనే అని ఆరోపించారు. కేటీఆర్ వెనక ఉండే దాడి చేయించారని విమర్శలు చేశారు. అమాయకులను బలి చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు.
కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పెట్టి తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకే వరంగల్ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల గంటకు మూడు కోట్లు వడ్డీ చెల్లించాల్సి వస్తుందని మంత్రి సీతక్క చెప్పారు. ఎన్నో ఆర్థిక సమస్యలు ఉన్నా.. తమ ప్రభుత్వం ఉద్యోగులు, విద్యార్థులకు మేలు చేస్తోందని అన్నారు.
యూనివర్సిటీల్లో వ్యవస్థలు దెబ్బతిన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వ్యవస్థల పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయాలని సూచించారు. యూనివర్సిటీ ప్రస్తుత పరిస్థితి పైన సమగ్ర అధ్యయనం చేసి చర్యలు మొదలు పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచడంతో 7.65 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి జరగనుందని మంత్రి సీతక్క తెలిపారు. పిల్లలకు కడుపునిండా భోజనం పెట్టాలని పెరిగిన ధరలకు అనుగుణంగా డైట్, కాస్మోటిక్ చార్జీలను పెంచిన సీఎం రేవంత్‌రెడ్డికు ధన్యవాదాలు తెలిపారు. ఇక హాస్టల్ విద్యార్థులు అర్థాకళితో అవస్థలు పడాల్సిన అవసరం లేదని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
తెలంగాణలో ఎక్కడా తాగునీటి సరఫరాలో సమస్య రానీయకూడదని మంత్రి సీతక్క ఆదేశించారు. శుద్ధి చేసిన నీరే సరఫరా అయ్యేలా చూడాలని సూచించారు. రిజర్వాయర్లలో సరిపోయినంత నీటి నిలువలు ఉన్నాయని.. వాటిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.
గడిచిన పదేళ్లలో మూసీ ప్రక్షాళన కోసం, ఆ ప్రాంత ప్రజల సంక్షేమం, ఉపాధి కోసం నయాపైసా కేటాయించని ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం ఎదుట ధర్నా చేపట్టాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని రాష్ట్ర మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.