Share News

MLA: డబ్బులకు పోస్టింగ్‌లు ఇప్పించుడే ఆయన పని..

ABN , Publish Date - Oct 30 , 2024 | 10:04 AM

టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌(Madhuyashki Goud) డబ్బులు తీసుకుని పోస్టింగ్‌లు ఇప్పించడమే తప్ప ప్రజాసమస్యలను పరిష్కరించలేని వ్యక్తి అని ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(LB Nagar MLA Devi Reddy Sudhir Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని తనపై మాట్లాడాలని లేకుంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

 MLA: డబ్బులకు పోస్టింగ్‌లు ఇప్పించుడే ఆయన పని..

- ప్రజాసమస్యలను పరిష్కరించ లేని మధుయాష్కీగౌడ్‌

- 118 జీఓ సమస్యను పరిష్కరించే వరకూ నిద్రపోను

- ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి

హైదరాబాద్: టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌ మధుయాష్కీగౌడ్‌(Madhuyashki Goud) డబ్బులు తీసుకుని పోస్టింగ్‌లు ఇప్పించడమే తప్ప ప్రజాసమస్యలను పరిష్కరించలేని వ్యక్తి అని ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(LB Nagar MLA Devi Reddy Sudhir Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని తనపై మాట్లాడాలని లేకుంటే వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం బీఎన్‌రెడ్డినగర్‌ డివిజన్‌ బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన జీఓ118కు సంబంధించిన వివిధ కాలనీల సంక్షేమ సంఘాల ప్రతినిధుల సమావేశానికి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: లాంజ్ యాప్‏తో లూటీ..


నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఎల్‌బీనగర్‌ నియోజకవర్గానికి వర్తిస్తున్న 118 జీవో విషయంలో ఎవరు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, కన్వీనెన్స్‌ డీడ్‌ ఇచ్చేవరకూ ‘మీతో కలిసి పోరాటం చేస్తా. ఎమ్మెల్యే పదవికి నా రాజీనామా లెటర్‌తోనే 118 జీవో త్వరితగతిన అమలులోకి వచ్చింది’ అని అన్నారు. 118 జీవోతో 2,400 కన్వీనెన్స్‌ డీడ్‌లను అధికారులు రిలీజ్‌ చేశారని, దీంట్లో 940 ఇళ్లకు రిజిస్ర్టేషన్లు పూర్తైనట్లు ఆయన తెలిపారు. మిగిలిన వారికి కూడా న్యాయం చేసే వరకు అండగా ఉంటానన్నారు.


city3.2.jpg

118 జీవో తప్పులతడక అని, తాను ప్రజలను మోసం చేసినట్లు ఆరోపిస్తున్న మధుయాస్కీగౌడ్‌ ‘ఉన్నది మీ కాంగ్రెస్‌ ప్రభుత్వం కదా.. ఇట్టి సమస్యను ఇప్పటి వరకు ఎందుకు పరిష్కరించలేదు’ అని ప్రశ్నించారు. నిజామాబాద్‌(Nizamabad) ప్రజలు కాదంటేనే ఇక్కడికి వచ్చి రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. డబ్బులు వచ్చే పనులు చేస్తవు కానీ, ప్రజాసమస్యలను మాత్రం పరిష్కరించవా అని ఎద్దేవాచేశారు. డబ్బులు తీసుకుని పోస్టింగ్‌లు ఇప్పించడమే ‘నీ పని’ అని, త్వరలోనే ఆ వివరాలను తెలియజేస్తానని పేర్కొన్నారు.


సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) మధుయాష్కీ కంటే తనకే ఎక్కువ సన్నిహితుడని అన్నారు. రాహుల్‌ గాంధీని అడ్డుపెట్టుకుని రాజకీయం చేసే మధుయాష్కీగౌడ్‌ తనపై మాట్లాడేముందు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. 118 సమస్య పరిష్కారం కాకుంటే రాజీనామా చేయడానికి కూడా సిద్ధం అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ కాలనీల ప్రతినిధులు దండు పుల్లారెడ్డి, పోగుల రాంబాబు, పురుశోత్తంరెడ్డి, సుధాకర్‌రెడ్డి, అమరేందర్‌ రెడ్డి, దామోదర్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, ముత్యంరావు, రవీందర్‌రెడ్డి, పార్టీ నాయకులు సుమన్‌గౌడ్‌, సతీ్‌షకుమార్‌ గౌడ్‌, గంగం శివశంకర్‌, మనోజ్‌ గౌరిశెట్టి, కాజ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలో మట్టి రోడ్డు లేకుండా చేస్తాం

ఈవార్తను కూడా చదవండి: యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌కు 7,037 కోట్ల అదనపు రుణం

ఈవార్తను కూడా చదవండి: KTR : కాంగ్రెస్‌ దాడులను ఎదుర్కొందాం

ఈవార్తను కూడా చదవండి: టీజీఎస్పీ పోలీసుల వైఖరిపై నిఘా

Read Latest Telangana News and National News

Updated Date - Oct 30 , 2024 | 10:04 AM