MLA: వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం..
ABN , Publish Date - Dec 17 , 2024 | 09:02 AM
గాయత్రినగర్ ప్రజలు ఎదుర్కొంటున్న వరద ముంపు సమస్యను పరిష్కరిస్తామని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(Sanathnagar MLA Talasani Srinivas Yadav) వెల్లడించారు.
హైదరాబాద్: గాయత్రినగర్ ప్రజలు ఎదుర్కొంటున్న వరద ముంపు సమస్యను పరిష్కరిస్తామని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(Sanathnagar MLA Talasani Srinivas Yadav) వెల్లడించారు. సోమవారం అమీర్‌పేట డివిజన్‌లోని గాయత్రినగర్‌లో ఆయన అధికారులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం వర్షాకాలంలో కాలనీలోని నాలా పొంగిపోయి ముంపునకు గురవుతున్న నేపథ్యంలో గతంలో మంత్రి హోదాలో ఈ ప్రాంతంలో పర్యటించి సమస్య శాశ్వత పరిష్కారం కోసం రూ.1.50 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు తెలిపారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: సైబర్ క్రైం ఠాణాలో 24/7 సేవలు..
ఈ నిధులతో 95 మీటర్ల మేర బాక్స్ డ్రైన్ నిర్మాణం కోసం పనులు ప్రారంభించగా 45 మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. మిగతా పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ పనులు పూర్తయితే ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ముంపు సమస్య నుంచి కాలనీ ప్రజలకు శాశ్వత విముక్తి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఈఈ వెంకటనారాయణ, డీఈ సందీప్, ఏఈ అమీర్, టౌన్ ప్లానింగ్ ఏసీపీ సయ్యద్, ఎలక్ట్రికల్ ఏఈ మౌనిక, బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షులు హన్మంతరావు, ప్రధాన కార్యదర్శి సంతోష్, కరుణాకర్‌రెడ్డి, ప్రవీణ్ రెడ్డి, గోపలాల్ చౌహాన్, గులాబ్ సింగ్, కట్టా బలరాం తదితరులు పాల్గొన్నారు.
ఎమ్యెల్యే ఆదేశాలతో చెత్త తరలింపు..
గాయత్రీనగర్‌లో డ్రైనేజీ పనుల పరిశీలనకు వచ్చిన ఎమ్యెల్యే తలసానికి చెత్తకుప్ప కనిపించడంతో వెంటనే తొలగించాలని శానిటేషన్ అధికారులను ఆదేశించారు. కాలనీలో పారిశుధ్య నిర్వాహణ సక్రమంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే ఆదేశాల మేరకు చెత్తకుప్పను వెంటనే తొలగించారు.
ఈవార్తను కూడా చదవండి: చలి.. పులి.. నగరంలో పడిపోయిన ఉష్ణోగ్రతలు
ఈవార్తను కూడా చదవండి: Konda Surekha: రాములోరి భక్తులకు అసౌకర్యం కలగొద్దు
ఈవార్తను కూడా చదవండి: Farmer Insurance: రైతు బీమా నగదు కాజేసిన ఏఈవో
ఈవార్తను కూడా చదవండి: NDWA: నదుల అనుసంధానంపై కేంద్రం భేటీ 19న
Read Latest Telangana News and National News