Veerlapally Shankar: కల్వకుంట్ల కుటుంబంపైనే మాట్లాడా..
ABN , Publish Date - Dec 08 , 2024 | 03:55 AM
లగచర్ల ఘటనకు సంబంధించి తాను కల్వకుంట్ల కుటుంబంపైనే వ్యాఖ్యలు చేశానని, అందరు వెలమల ఉద్దేశించి మాట్లాడలేదని షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు.
వెలమలు తప్పుగా భావిస్తే ఉపసంహరించుకుంటా: వీర్లపల్లి శంకర్
షాద్‌నగర్, డిసెంబరు 7(ఆంధ్రజ్యోతి): లగచర్ల ఘటనకు సంబంధించి తాను కల్వకుంట్ల కుటుంబంపైనే వ్యాఖ్యలు చేశానని, అందరు వెలమల ఉద్దేశించి మాట్లాడలేదని షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను వెలమలు తప్పుగా భావిస్తే వాటిని ఉపసంహరించుకుంటున్నాని చెప్పారు. తాను ఒక యూ ట్యూబ్ చానల్‌తో మాట్లాడిన మాటలను పూర్తిగా ప్రసారం చేయకుండా అక్కడక్కడ వీడియో క్లిప్పింగ్‌లను కట్ చేసి సోషల్ మీడియాలో తప్పుడు అర్థం వచ్చేలా ప్రచారం చేశారన్నారు. వెలమలపై తనకు ఎలాంటి దురుద్దేశం లేదని వివరణ ఇచ్చారు.