Share News

Cyber Criminal: సౖబర్‌ నేరగాడి వలలో ఎమ్మెల్యే!

ABN , Publish Date - May 19 , 2024 | 03:27 AM

ఓ సైబర్‌ నేరగాడి వలకు ఏకంగా ఓ ఎమ్మెల్యేనే చిక్కాడు! తాను ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శినంటూ ఫోన్‌ చేసిన వ్యక్తి చెప్పిదంతా సావధానంగా వినేసి, అతడు చెప్పినట్లుగా రూ.3.60 లక్షలను ఖాతాలో వేశాడు! డీసీపీ కవిత వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇటీవల ఒక ఎమ్మెల్యేకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోనొచ్చింది. తాను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎమ్మెల్యేతో పరిచయం చేసుకున్న ఆవలి వైపు వ్యక్తి, తొందర్లోనే ముఖ్యమంత్రి ఒక కొత్త రుణపథకాన్ని ప్రారంభించబోతున్నారని చెప్పారు.

Cyber Criminal: సౖబర్‌ నేరగాడి వలలో ఎమ్మెల్యే!

  • ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శినంటూ ఫోన్‌

  • 3.60 లక్షలు ఖాతాలో వేయించుకున్న నిందితుడి అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ, మే 18(ఆంధ్రజ్యోతి): ఓ సైబర్‌ నేరగాడి వలకు ఏకంగా ఓ ఎమ్మెల్యేనే చిక్కాడు! తాను ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శినంటూ ఫోన్‌ చేసిన వ్యక్తి చెప్పిదంతా సావధానంగా వినేసి, అతడు చెప్పినట్లుగా రూ.3.60 లక్షలను ఖాతాలో వేశాడు! డీసీపీ కవిత వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇటీవల ఒక ఎమ్మెల్యేకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి ఫోనొచ్చింది. తాను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఎమ్మెల్యేతో పరిచయం చేసుకున్న ఆవలి వైపు వ్యక్తి, తొందర్లోనే ముఖ్యమంత్రి ఒక కొత్త రుణపథకాన్ని ప్రారంభించబోతున్నారని చెప్పారు. ఆ పథకం కింద వందల మందికి రూ. లక్షల్లో రుణాలు ఇవ్వాలని నిర్ణయించారని, ఎమ్మెల్యేకు ఆయన కోటా కింద 100 మందికి రుణాలు అందేలా తాను చూస్తానని చెప్పాడు. ఇందుకుగాను మనిషికి రూ.3,600 చొప్పున కమిషన్‌ ఇస్తే పని పూర్తవుతుందని నమ్మించాడు.


అతడి మాటలను నమ్మిన ఎమ్మెల్యే వెనుకా ముందు ఆలోచించకుండా మొత్తం రూ. 3.60లక్షలను అతడు చెప్పిన ఖాతాలో జమ చేశారు. తర్వాత సదరు గుర్తుతెలియని వ్యక్తి స్పందించడం మానేశాడు. అనుమానించిన ఎమ్మెల్యే తన వ్యక్తిగత కార్యదర్శి ద్వారా సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంకేతిక ఆధారాలతో రంగంలోకి దిగిన సీఐ రాజు బృందం.. నిందితుడు తోట బాలాజీ నాయుడు అలియాస్‌ మల్లారెడ్డి అలియాస్‌ దాసరి అనిల్‌ కుమార్‌ను అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఇతడిపై తెలంగాణ, ఏపీలో 37 కేసులున్నట్లు విచారణలో తేలింది. 2008లో ఎన్టీపీఎస్‌ రామగుండంలో ఏఈగా పనిచేసిన బాలాజీ 2009లో ఓ ఎమ్మెల్యే పీఏ నుంచి లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు

Updated Date - May 19 , 2024 | 03:27 AM