MLC Bypoll: ప్రశాంతంగా కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్
ABN , Publish Date - May 27 , 2024 | 10:49 AM
వరంగల్-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ఉదయం 8 గంటలకే ప్రారంభమైంది. అన్ని చోట్ల ఎలాంటి సమస్యలూ లేకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. జిల్లా వ్యాప్తంగా 118 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఖమ్మం: వరంగల్-ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ ఉదయం 8 గంటలకే ప్రారంభమైంది. అన్ని చోట్ల ఎలాంటి సమస్యలూ లేకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ కొనసాగనుంది. జిల్లా వ్యాప్తంగా 118 పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఖమ్మం నగరంలో 57 పోలింగ్ కేంద్రాలున్నాయి. బ్యాలెట్ పద్ధతిలో ఎమ్మెల్సీ ఎన్నిక ప్రారంభం కానుంది. పోలింగ్ కోసం 129 బ్యాలెట్ బాక్సులను అధికారులు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్‌తో పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులు నల్గొండలోని స్ట్రాంగ్ రూంకు తరలింపునకు అధికారులు ఏర్నాట్లు చేస్తున్నారు. 12 జిల్లాల్లో ఈ పోలింగ్ కొనసాగుతోంది. బ్యాలెట్ ద్వారా పట్టభద్రుల ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొత్తం ఓటర్లు 4,63,839, 605 కాగా.. పోలింగ్ కేంద్రాలు, 807 బ్యాలెట్ బాక్సులున్నాయి. పురుష ఓటర్లు...2 లక్షల 88 వేల 189 మంది, మహిళలు లక్ష 75 వేల 645 మంది, ఇతరులు ఐదుగురు ఉన్నారు.
Read Telangana News and Telugu News