మొడికుంట వాగు సవరణ అంచ నాలకు ఆమోదం
ABN , Publish Date - Nov 07 , 2024 | 04:22 AM
మొడికుంటవాగు ఎత్తిపోతల పథకం సవరణ అంచనాలకు స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ(ఎ్‌సఎల్‌ఎ్‌ససీ) ఆమోదం తెలిపింది. బుధవారం ఈఎన్‌సీ(జనరల్) జి.అనిల్‌కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది.
నల్లగొండలో రెండు ప్రాజెక్టుల ఈవోటీలకు కూడా..
హైదరాబాద్, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): మొడికుంటవాగు ఎత్తిపోతల పథకం సవరణ అంచనాలకు స్టేట్ లెవల్ స్టాండింగ్ కమిటీ(ఎ్‌సఎల్‌ఎ్‌ససీ) ఆమోదం తెలిపింది. బుధవారం ఈఎన్‌సీ(జనరల్) జి.అనిల్‌కుమార్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో 13,500ఎకరాలకు సాగునీరందించే మొడికుంటవాగు ఎత్తిపోతల పథకం సవరణ అంచనాలపై చర్చించారు. తొలుత రూ.550కోట్లతో దీని నిర్మాణ అంచనా వ్యయం తయారు చేయగా.. తర్వాత రూ.750 కోట్లకు సవరించారు.
మరోవైపు దేవాదుల ఎత్తిపోతల పథకంలో ఒక పనికి, సీతారామ ఎత్తిపోతల పథకంలోని ఎన్కూర్‌లో పైప్‌లైన్ క్రాసింగ్‌కు రూ.12కోట్ల పనులకు, అలాగే నల్లగొండ ఎస్‌ఈ పరిధిలో రెండు పనులను పూర్తి చేసే గడువు(ఈవోటీ) పెంపు ప్రతిపాదనలకు స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది