ED Notice: కాంగ్రెస్ నేత అజారుద్దీన్‌కు ఈడీ సమన్లు.. ఎందుకంటే
ABN , Publish Date - Oct 03 , 2024 | 12:14 PM
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు(Mohammad Azharuddin) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) గురువారం సమన్లు పంపింది. అజారుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మనీ లాండరింగ్ జరిగిందని, దాదాపు రూ.20 కోట్ల అవకతవలు జరిగాయని ఈడీ తన నోటీసుల్లో పేర్కొంది.
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు(Mohammad Azharuddin) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) గురువారం సమన్లు పంపింది. అజారుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మనీ లాండరింగ్ జరిగిందని, దాదాపు రూ.20 కోట్ల అవకతవలు జరిగాయని ఈడీ తన నోటీసుల్లో పేర్కొంది. ఆయన హయాంలో హెచ్‌సీఏలో నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలున్నాయి. ఈడీ సమన్లలోని వివరాల ప్రకారం.. అజారుద్దీన్ గురువారం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
అయితే ఈ కేసులో ఆయనకు సమన్లు అందడం ఇదే తొలిసారి. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం కోసం డీజిల్ జనరేటర్లు, అగ్నిమాపక పరికరాలు, క్యానోపీల సేకరణ కోసం కేటాయించిన రూ.20 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై తొలుత ఆయనపై కేసు నమోదైంది. అక్టోబర్ 2023లో ఆయనతోపాటు పలువురు హెచ్‌సీఏ మాజీ అధికారులపై హైదరాబాద్ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. భారతీయ శిక్షాస్మృతిలోని నేరపూరిత విశ్వాస ఉల్లంఘన, మోసం, ఫోర్జరీ, కుట్ర అభియోగాల కేసులు నమోదు చేశారు.
ఫోరెన్సిక్ ఆడిట్..
నిధుల మళ్లింపు జరిగిందని భావించిన హెచ్‌సీఏ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఫోరెన్సిక్ ఆడిట్ మార్చి 2020 నుంచి ఫిబ్రవరి 2023 వరకు దర్యాప్తు చేపట్టింది. నిధుల దుర్వినియోగం, ప్రైవేట్ ఏజెన్సీలకు నగదు మళ్లింపు జరిగినట్లు గుర్తించింది. దర్యాప్తు అనంతరం హెచ్‌సీఏ సీఈవో సునీల్ కాంటే బోస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అవన్నీ అబద్ధాలు..
తనపై నమోదైన కేసును రాజకీయ ప్రేరేపిత కుట్రగా అజారుద్దీన్ అభివర్ణించారు. తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రత్యర్థులు కుట్రపన్నారని అన్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తానని తెలిపారు. 2023 నవంబర్‌లో పలు కేసుల్లో అజారుద్దీన్‌కు బెయిల్ మంజూరైన విషయం తెలిసిందే.
Gold Prices Today: బంగారం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగాయ్
Konda Surekha: ఛీ ఛీ.. అసహ్యమేస్తోంది .. కొండా సురేఖపై జూ.ఎన్టీఆర్, నాని మండిపాటు
Naga Chaitanya: సిగ్గు.. సిగ్గు.. సురేఖ కామెంట్స్‌పై నాగచైతన్య మండిపాటు
Konda Surekha: విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. దిగొచ్చిన కొండా సురేఖ.. ఏమన్నారంటే
For Latest News and Telangana News click here