Home » HCA
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో వివాదాలు సుప్రీంకోర్టుకు చేరిన విషయం తెలిసిందే. హెచ్‌సీఏ పాలనా సిఫార్సులకు సంబంధించి ఎక్కువ మంది మెంబర్లు కుటుంబ సభ్యులేనని సుప్రీంకోర్టు నియమించి జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు బయటపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ సిఫార్సును వ్యతిరేకిస్తూ హెచ్‌సీఏ సభ్యులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిగింది. పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌కు(Mohammad Azharuddin) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) గురువారం సమన్లు పంపింది. అజారుద్దీన్ హెచ్‌సీఏ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మనీ లాండరింగ్ జరిగిందని, దాదాపు రూ.20 కోట్ల అవకతవలు జరిగాయని ఈడీ తన నోటీసుల్లో పేర్కొంది.
తెలంగాణ, హైదరాబాద్ క్రికెట్ ప్రేమికులకు శుభవార్త వచ్చింది. క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ విడుదలైంది. ఐపీఎల్ మొదటి దశ షెడ్యూల్లో భాగంగా 2 మ్యాచ్‌లకు హైదరాబాద్ నగరం ఆతిథ్యమివ్వనుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఈ మ్యాచ్‌లను నిర్వహించనుంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఒక్కో మ్యాచ్ చొప్పున రెండు మ్యాచ్‌లు ఉండనున్నాయని హెచ్‌సీఏ సంఘం అధ్యక్షుడు అర్శనపల్లి జగన్మోహన్ రావు వెల్లడించారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. ఉప్పల్ వేదికగా జరిగిన భారత్, ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్‌ను వీక్షించడానికి వచ్చిన ప్రేక్షకులకు సరైన ఏర్పాట్లు చేయలేదు. తాగడానికి సరైన మంచి నీటి వసతి కల్పించకపోవడానికి తోడు టాయిలెట్స్‌ను కూడా శుభ్రంగా ఉంచలేదు.
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు మల్కాజిగిరిలో కోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్లో అజారుద్దీన్‌పై నమోదైన కేసులో కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది...
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. హెచ్‌సీఏ నూతన అధ్యక్షుడిగా జగన్మోహనరావు విజయం సాధించారు. కేవలం ఒకే ఒక్క ఓటుతో ఆయన విజయం సాధించారు.