Mohan Babu: ముందస్తు బెయిల్‌పై.. మోహన్‌బాబు పిటిషన్ వాయిదా
ABN , Publish Date - Dec 20 , 2024 | 04:17 AM
టీవీ చానల్ లోగోతో జర్నలిస్టుపై దాడికి సంబంధించిన కేసులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేస్తూ సినీనటుడు మోహన్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది.
బెయిల్ ఇవ్వొద్దన్న జర్నలిస్టు రంజిత్
హైదరాబాద్, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): టీవీ చానల్ లోగోతో జర్నలిస్టుపై దాడికి సంబంధించిన కేసులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేస్తూ సినీనటుడు మోహన్‌బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. మోహన్‌బాబు, ఆయన కుమారుడు మంచు మనోజ్ మధ్య ఘర్షణల కవరేజీలో ఉన్న రంజిత్‌పై మోహన్‌బాబు దాడి చేసిన విషయం తెలిసిందే..! దీనిపై పహాడీషరీఫ్ ఠాణాలో మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ కేసులో మోహన్‌బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ గురువారం మరోమారు జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఈ పిటిషన్‌లో జర్నలిస్టు రంజిత్ ఇంప్లీడ్ అయ్యారు.
రంజిత్ తరఫున న్యాయవాది ఎనుగంటి సుధాంశురావు వాదనలను వినిపిస్తూ.. మోహన్‌బాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వరాదని పేర్కొన్నారు. మోహన్‌బాబు హైదరాబాద్‌లో లేరని.. దుబాయ్ వెళ్లిపోయారని పేర్కొన్నారు. మోహన్‌బాబు తరఫు న్యాయవాది అవినాశ్‌రెడ్డి వాదిస్తూ.. తన క్లైంట్ హైదరాబాద్‌లోనే ఉన్నారని పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలు పరస్పర విరుద్ధంగా ఉన్నాయన్న ధర్మాసనం.. అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని సూచించింది. ముందస్తు బెయిల్ విషయంలో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది.