Share News

Hyderabad: ఆ అమ్మ వైద్య చికిత్సకు భరోసా!

ABN , Publish Date - Jun 04 , 2024 | 03:05 AM

బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఓ నిరుపేద మహిళ దీనావస్థపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన ‘ మా అమ్మను ఆదుకోరు ’ కథనంపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. బాధిత మహిళ అనుముల పద్మ కుటుంబసభ్యులను సీఎంవో అధికారులు పిలిచి మాట్లాడారు.

Hyderabad: ఆ అమ్మ వైద్య చికిత్సకు భరోసా!

  • బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న పద్మకు తక్షణ వైద్య చికిత్సకు సర్కారు రూ.5లక్షల ఎల్‌వోసీ

  • మిగతా వైద్యానికయ్యే సాయంపైనా హామీ

  • ‘ఆంరఽధజ్యోతి’ కథనానికి స్పందించిన సీఎంవో

హైదరాబాద్‌, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతోన్న ఓ నిరుపేద మహిళ దీనావస్థపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన ‘ మా అమ్మను ఆదుకోరు ’ కథనంపై ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. బాధిత మహిళ అనుముల పద్మ కుటుంబసభ్యులను సీఎంవో అధికారులు పిలిచి మాట్లాడారు. తక్షణ వైద్య చికిత్స కోసం రూ.5 లక్షల ఎల్‌వోసీ (లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌)ను పద్మ కుమారుడు రాజుకు సీఎం రేవంత్‌రెడ్డి ఓఎస్డీ వేముల శ్రీనివాసులు అందజేశారు. పద్మకు మెరుగైన వైద్య చికిత్స కోసం బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడారు.


వైద్య చికిత్సకయ్యే మిగతా వ్యయాన్ని భరించేందుకు యత్నిస్తామని హామీనిచ్చారు. అలాగే ఇప్పటివరకు ఆమె వైద్యానికి అయిన ఖర్చును చీఫ్‌మినిస్టర్‌ రీలిఫ్‌ ఫండ్‌(సీఎంఆర్‌ఎఫ్‌) ద్వారా వీలైనంత ఎక్కువగా ఇప్పించే ప్రయత్నం చేస్తామని బాధిత కుటుంబసభ్యులకు చెప్పారు. తమ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చినందుకు బాధిత కుటుంబం ‘ఆంధ్రజ్యోతి’కి కృతజ్ఞతలు తెలిపింది.

Updated Date - Jun 04 , 2024 | 03:05 AM