BJP: రాహుల్‌పై చర్యలు తీసుకోవాలి: రఘునందన్
ABN , Publish Date - Dec 20 , 2024 | 03:41 AM
ఎన్డీయే ఎంపీలు గాయపడటానికి కారణమైన లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఎన్డీయే ఎంపీలు గాయపడటానికి కారణమైన లోక్‌సభలో విపక్షనేత రాహుల్‌గాంధీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు డిమాండ్ చేశారు. పార్లమెంటు లోపలికి వెళ్లేందుకు ఇంకో దారి ఉన్నప్పటికీ ఆయన కావాలని నలుగురిని వెంటబెట్టుకుని ఎన్డీయే ఎంపీలు ఆందోళన తెలిపే ప్రాంతానికి వచ్చారన్నారు. పార్లమెంటులో తాను చూస్తుండగా.. రాహుల్‌గాంధీ వచ్చి రావడంతోనే ఒకరి ఛాతీపై చెయ్యి వేసి.. మహిళా ఎంపీలు అని కూడా చూడకుండా వారిని నెట్టివేసిపోయారని ఆయన ఆరోపించారు. దేశానికి స్వాతంత్య్ర వచ్చినప్పటి నుంచి ఏనాడూ అంబేడ్కర్‌ను కాంగ్రెస్ గౌరవించలేదని తెలిపారు.