TG News: సినిమాను తలపించేలా ఫైట్..
ABN , Publish Date - Dec 25 , 2024 | 01:11 PM
Telangana: నల్గొండ జిల్లాలో కొందరు యువకులు రెచ్చిపోయారు. దేవరకొండ మండలం తాటికొల్‌కు చెందిన కొందరు యువకులు ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగారు. సినిమా ఫైటింగ్ రేంజ్‌లో రోడ్డుపైనే పిడుగుద్దులు గుద్దుకున్నారు. తాటికొల్ యువకుల గ్యాంగ్ వార్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకరిపై ఒకరు కర్రలతో దాడి పాల్పడ్డారు.
నల్గొండ, డిసెంబర్ 25: ఇప్పుడు యువతపై సినిమాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తాము హీరోలమనే రేంజ్‌లో ఫోజ్‌లు ఇస్తుంటారు యువకులు. ఏదైనా గొడవ జరిగితే తమని తాము హీరోలు ఊహించుకుంటూ వెళ్లి ఫైటింగ్ చేస్తుంటారు. కానీ రీల్ హీరోలు డూబ్‌లను పెట్టుకుని ఫైటింగ్ చేస్తుంటారనే విషయాన్ని మరుస్తారు యువకులు. చివరకు గొడవలకు వెళ్లి తీవ్రంగా గాయపడుతుంటారు. తాజాగా నల్గొండ జిల్లాలోనూ (Nalgonda) ఇలాంటే ఘటనే చోటు చేసుకుంది. సినిమా ఫైటింగ్‌ను తలపించేలా కొందరు యువకులు రోడ్డుపైనే కొట్టుకోవడం వైరల్‌గా మారింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నల్గొండ జిల్లాలో కొందరు యువకులు రెచ్చిపోయారు. దేవరకొండ మండలం తాటికొల్‌కు చెందిన కొందరు యువకులు ఒకరిపై ఒకరు ఘర్షణకు దిగారు. సినిమా ఫైటింగ్ రేంజ్‌లో రోడ్డుపైనే పిడుగుద్దులు గుద్దుకున్నారు. తాటికొల్ యువకుల గ్యాంగ్ వార్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఒకరిపై ఒకరు కర్రలతో దాడి పాల్పడ్డారు.
ఈ ఘటనలో ఒకరు గాయపడ్డారు. తీవ్రంగా గాయడిన యువకుడిని హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి తొమ్మిది మంది యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. గత ఆదివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Kakani: అధికారంలోకి వచ్చాక అంతుచూస్తాం.. కాకాణి దౌర్జన్యం
ఏం జరిగిందంటే...
తాటికొల్‌కు చెందిన రాకేష్, మహేష్ అనే ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణ గ్యాంగ్ వార్‌కు దారి తీసింది. దసరా పండుగ రోజున వీరి మధ్యన జరిగిన ఘర్షణలను దృష్టిలో ఉంచుకుని గత ఆదివారం( డిసెంబర్ 22) రాత్రి ఇద్దరు గొడవపడ్డారు. అయితే గొడవ గురించిన తెలిసిన మహేష్ తండ్రి అక్కడకు చేరుకుని వారిద్దిరిని విడిపించి మహేష్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లాడు. అయితే రాకేష్ మాత్రం జరిగిన గొడవను ఇంకా పెద్దది చేస్తూ హైదరాబాద్ నుంచి తన మిత్రులను పిలుపించుకున్నాడు. మూడు బైక్‌లపై తొమ్మిది మంది యువకులు కర్రలతో అక్కడకు చేరుకున్నారు.
అనంతరం మహేష్‌పై తీవ్రంగా దాడి చేశారు. విచక్షణారహితంగా కర్రలతో బాధడంతో మహేష్ తీవ్రంగా గాయపడ్డాడు. మహేష్ పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలించి చికిత్స అందజేస్తున్నారు. అయితే గొడవపడిని దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ టీవీ ఫుటేజ్‌లో రికార్డు అయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. గ్యాంగ్ వార్‌కు పాల్పడిన తొమ్మిది మంది యువకులపై కేసు నమోదు చేశారు. యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే మద్యం, గంజాయి మత్తులోనే యువకుల మధ్య ఘర్షణ జరిగినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ రేంజ్‌లో యువకులు ఘర్షణకు దిగడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం
Read Latest Telangana News And Telugu News