MLC Elections: డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా .. ఎన్నికల బరిలోకి..
ABN , Publish Date - Nov 04 , 2024 | 08:12 PM
మరికొద్ది రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ.. డీఎస్పీ మదనం గంగాధర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన ఉద్యోగానికి రాజీనామా చేసి.. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచారు. ఉద్యోగం ద్వారా కంటే.. రాజకీయంగా సేవ చేసేందుకు మరింత అవకాశం ఉండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పరోక్ష ఎన్నిక ద్వారా చట్టసభకు ఎన్నిక కావాలని పలువురు ప్రముఖులు భావిస్తున్నారు. ఆ జాబితాలో మదనం గంగాధర్ చేరారు. ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు తన డీఎస్పీ ఉద్యోగానికి సైతం ఆయన రాజీనామా చేశారు. ఇక తన ఈ జీవితం ప్రజా సేవకు అంకితమంటున్నారు.
డీఎస్పీ ఉద్యోగానికి రాజీనామా చేసి ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగిన మదనం గంగాధర్ స్వస్థలం.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్. భిక్షాటనే వృత్తిగా చేసుకునే జీవించే సంచార జాతికి చెందిన వ్యక్తి ఆయన. చిన్ననాటి నుంచి పని చేసుకుంటూనే కష్టపడి చదువుకున్నారు. ఆ క్రమంలో నిజామాబాద్‌లో జీజీ కాలేజీ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు.
Viral News: సోమశిల టు శ్రీశైలం బోటు ప్రయాణం..
22 ఏళ్లకే ఎస్ఐ..
అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ప్రవేశం పొందారు. దీంతో ఆయన జీవితం మలుపు తిరిగింది. అలా 22 ఏళ్ల వయస్సులో తొలి ప్రయత్నంలోనే ఎస్‌ఐగా మదనం గంగాధర్ సెలెక్టయ్యారు. అలా 1998 బ్యాచ్‌లో ఎస్‌ఐగా చేరారు. గంగాధర్ తల్లిదండ్రులకు ఐదురుగు సంతానం. అందులో ఆయన మొదటి సంతానం. దీంతో కుటుంబాన్ని పైకి తీసుకు రావడానికి గంగాధర్ చేసిన ప్రయత్నాలన్నీ సఫలీకృతమయ్యాయి.
TG Politics: అమరవీరుల స్తూపం వద్దకు వస్తారా? గంగాపురం, బండికి పొన్నం సవాల్
నల్గొండలో ఎస్ఐగా..
నల్గొండ జిల్లాలో ఎస్ఐగా విధులు నిర్వహించారు. అదే సమయంలో.. అంటే.. 2010లో సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా ఆయనకు పదోన్నతి లభించింది. అయితే తన 26 ఏళ్ల సర్వీసులో వృత్తిపట్ల నిబద్దతతో పని చేశారు. అలాగే ఎవరి పట్ల నిస్పక్షపాతంగా వ్యవహరించ లేదు. అదే విధంగా ఎవరిని అణిచివేసే ప్రయత్నం చేయలేదు. తమకు జరిగిన అన్యాయంతో పోలీస్ స్టేషన్ మెట్లేక్కిన ఏ ఒక్క బాధితుడికి న్యాయం జరిగేలా చూశారు.
Also Read: కోడెల విగ్రహంపై మంత్రి గొట్టిపాటి కీలక వ్యాఖ్యలు
విధి నిర్వహాణలో పతకాలు..
అలాగే నల్గొండలో శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయని భావించి.. వాటిని ఆదిలో నియంత్రించగలిగాను. దీంతో ఉన్నతాధికారుల ప్రశంసలకు సైతం ఆయన పాత్రుడయ్యారు. ఇక పోలీస్ శాఖలో చేరిన కొన్ని సంవత్సరాలకే.. కఠిన సేవా, ఉత్తమ సేవా, ముఖ్యమంత్రి సర్వోన్నత పతకాలను ఆయనను వరించాయి.
Also Read: AP Politics: జగన్‌కి జోగి ఝలక్..!
దాదాపు 200 రివార్డులు..
ఇప్పటి వరకు దాదాపు 200 రివార్డులను సైతం గంగాధర్ అందుకున్నారు. ఓ పోలీస్ అధికారిగా నేరాలు నియంత్రించడంతోపాటు ప్రజలను జాగృతి చేయడంతో ఆయన నూటికి నూరు శాతం సఫలీకృతుడయ్యారు. ఇక సంస్థాన్ నారాయణ్‌పూర్ గ్రామస్తులు చికున్ గున్యా బారిన పడిన సమయంలో.. మెడికల్ క్యాంపులు నిర్వహించి.. వారికి అందించిన సేవలను వారు నేటికి మరువ లేక పోవడం గమనార్హం.
Also Read: కివి పండుతో ఇన్ని లాభాలున్నాయా..?
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల పేపర్లు లీక్ కేసులో..
అలాగే వివిధ స్థాయిల్లో పరీక్షలు తప్పిన యువత.. చెడు మార్గంలో పయనించకుండా.. వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించేందుకు ఆయన శక్తి వంచన లేకుండా కృషి చేశారు. అదే విధంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో పలు కేసులను చాలా చాకచక్యంగా ఆయన పరిష్కరించారు. అలాగే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్నప్పుడు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్లో పేపర్ లీక్ దర్యాప్తుతోపాటు దేశ భద్రతకు సంబంధించిన అతి పెద్ద కేసుల విచారణలో సైతం గంగాధర్ పాల్గొన్నారు. అయితే దశాబ్దాల సర్వీసులో ఇప్పటి వరకు ఆయన ఒక్క మెమో కూడా తీసుకోకపోవడం గమనార్హం.
పోలీస్ వ్యవస్థ గొప్పది కానీ..
అయితే పోలీస్ వ్యవస్థ చాలా గొప్పగా రూపొందించబడింది. కానీ దానిని నడుపుతున్న వ్యక్తులు స్వభావం సరిగ్గా లేనప్పుడు ఆయా వ్యవస్థలు సైతం కలుషితమవుతాయి. దీంతో ప్రజలతోపాటు ప్రభుత్వం సైతం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. అందుకే వ్యవస్థలో.. సమాజంతోపాటు వ్యక్తుల స్వభావంలో మార్పు రావాలని గంగాధర్ ఆకాంక్షిస్తారు. అందుకు ఆయన తన వంతు కృషి చేస్తున్నారు. ఆ క్రమంలో పోలీస్ శాఖలో పలు మార్పులు రావాలని ఆయన బలంగా ఆకాంక్షిస్తున్నారు. నేటి రాజకీయాల్లోకి యువత సైతం రావాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన అభిప్రాయపడుతున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలవాలని మదనం గంగాధర్ నిర్ణయించారు. అందుకు కుటుంబ సభ్యులు సైతం ఆయన అండ దండ.. గా నిలిచారు.
Read Latest Telangana News And Telugu News