Share News

Real Estate: ప్రభుత్వ అనుమతులుంటే కూల్చరు!

ABN , Publish Date - Oct 22 , 2024 | 04:51 AM

ప్రభుత్వ అనుమతులు తీసుకొని నిర్మించిన ఏ ప్రాజెక్టును ఎవరూ కూల్చరని, నిర్మాణ సంస్థలు, డెవలపర్లు, కొనుగోలుదారులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌

Real Estate: ప్రభుత్వ అనుమతులుంటే కూల్చరు!

  • డెవలపర్లు, కొనుగోలుదారులు ఆందోళన చెందొద్దు

  • నరెడ్కో తెలంగాణ అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి

  • హైటెక్స్‌లో 25 నుంచి 27 వరకు ప్రాపర్టీ షో

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ అనుమతులు తీసుకొని నిర్మించిన ఏ ప్రాజెక్టును ఎవరూ కూల్చరని, నిర్మాణ సంస్థలు, డెవలపర్లు, కొనుగోలుదారులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవల్‌పమెంట్‌ కౌన్సిల్‌(నరెడ్కో) తెలంగాణ అధ్యక్షుడు ఎం.విజయసాయి, ప్రధాన కార్యదర్శి కె.శ్రీధర్‌రెడ్డి తెలిపారు. అన్ని అనుమతులున్న ప్రాజెక్టులు కూడా అక్రమంగా నిర్మించారనే తప్పుడు సమాచారంతో కొనుగోలుదారుల్లో అనేక సందేహాలు, ఆందోళనలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రభుత్వ అనుమతులు తీసుకున్న నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బందిలేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడం భరోసానిచ్చిందని చెప్పారు.


ఈ నెల 25 నుంచి 27 వరకు హైటెక్స్‌లోని ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో నిర్వహించనున్న నరెడ్కో ప్రాపర్టీ షో బ్రోచర్‌ను సోమవారం నరెడ్కో ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విజయసాయి, శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న మూసీ అభివృద్ధి ప్రాజెక్టు, ఆర్‌ఆర్‌ఆర్‌, మెట్రో విస్తరణ, ఫ్యూచర్‌ సిటీ వంటి ప్రాజెక్టులు రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ వృద్ధికి దోహదపడతాయని తెలిపారు. ప్రాపర్టీ షోలో వందలాది ప్రాజెక్టులకు చెందిన ఫ్లాట్లు, ఇళ్లు, స్థలాలు అందుబాటులో ఉంటాయని, కొనుగోలుదారులు తమకు నచ్చిన ఆస్తులను ఎంచుకోవచ్చని చెప్పారు. దాదాపు 100 సంస్థలకు చెందిన ప్రాజెక్టులను ప్రదర్శిస్తారని తెలిపారు.

Updated Date - Oct 22 , 2024 | 04:51 AM