New Year: తారల తళుకులు.. మోడళ్ల మెరుపులు.. ఈసారి అంతకుమించి..
ABN , Publish Date - Dec 29 , 2024 | 11:50 AM
న్యూ ఇయర్ వేడు కలకు నగరం ముస్తాబవుతున్నది. చాలా సంవత్సరాల తరువాత మ్యూజికల్ నైట్‌ల సందడి అధికంగా కనిపించబోతుంది. న్యూ ఇయర్ వేడుకల్లో గాయకులు కార్తీక్, రామ్ మిర్యాల, సునీత, అమాల్ మాలిక్, మధుర్ శర్మ, రోల్ రైడా, సింహా.. ఇలా చాలామంది గానాలాపన చేయనున్నారు. సందేశ్‌బ్యాండ్, మైకం, మరకాస్, కాప్రిసియో లాంటి మ్యూజిక్‌బ్యాండ్లు సైతం నగరవాసులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యాయి.
- న్యూ ఇయర్ వేడుకలకు నగరం ముస్తాబు
- 70శాతం పార్టీ, 30శాతం పునరుత్తేజం కోసమంటూ వేడుకలు
- గతంతో పోలిస్తే ఈసారి పెరిగిన మ్యూజికల్‌నైట్‌లు
- టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్ గాయకుల వరకూ హాజరు
హైదరాబాద్ సిటీ: న్యూ ఇయర్ వేడు కలకు నగరం ముస్తాబవుతున్నది. చాలా సంవత్సరాల తరువాత మ్యూజికల్ నైట్‌ల సందడి అధికంగా కనిపించబోతుంది. న్యూ ఇయర్ వేడుకల్లో గాయకులు కార్తీక్, రామ్ మిర్యాల, సునీత, అమాల్ మాలిక్, మధుర్ శర్మ, రోల్ రైడా, సింహా(Karthik, Ram Miryala, Sunitha, Amal Malik, Madhur Sharma, Roll Raida, Simha).. ఇలా చాలామంది గానాలాపన చేయనున్నారు. సందేశ్‌బ్యాండ్, మైకం, మరకాస్, కాప్రిసియో లాంటి మ్యూజిక్‌బ్యాండ్లు సైతం నగరవాసులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యాయి. ఓ కార్యక్రమ నిర్వాహకుడు మాట్లాడుతూ గత ఐదారేళ్లుగా డీజేలతో నగరవాసులు విసుగెత్తిపోయారని, వాటినుంచి కాస్త మార్పు కోరుకుంటున్నారని అన్నారు. ప్రత్యక్ష ప్రదర్శనలలో ఉన్న అనుభూతి, ఈ డీజేలతో రాదని, అందుకే ఈసారి చాలామంది నిర్వాహకులు గాయనీగాయకులు, బ్యాండ్లకు ఎక్కు వ ప్రాధాన్యమిచ్చినట్లు వెల్లడించారు.
ఈ వార్తను కూడా చదవండి: Dharani: సంక్రాంతిలోపే భూ భారతి!
ఇంటిల్లిపాదికీ వినోదం కోసం..
నూతన సంవత్సర వేడుకలంటే అధికంగా యువతను లక్ష్యంగా చేసుకుని నిర్వహిస్తారు. కానీ, ఈసారి కాస్త మార్పు కనిపిస్తోంది. యువతతోపాటు ఇంటిల్లిపాదికీ ఆనందం కలిగించడానికి ఎక్కువ శాతం కార్యక్రమాల నిర్వహణకు నిర్వాహకులు ప్రణాళిక చేశారు. నోవోటెల్ హోటల్‌లో ఓ కార్యక్రమం చేస్తోన్న సుమంత్, వినోద్‌లు ఇదే విషయమై మాట్లాడుతూ పిల్లల కోసం ప్రత్యేకంగా కిడ్స్ ఏరీనా ఏర్పాటుచేయడంతో పాటుగా యువత, మహిళలు, పెద్దవారి కోసం ఏర్పాట్లు కూడా ప్రత్యేకంగా చేయబోతున్నామని అన్నారు.
కత్రియా హోటల్‌లో ఈవెంట్ చేస్తోన్న వంశీ మాట్లాడుతూ ఫ్యాషన్ షోలతో పాటుగా అందరినీ ఆకట్టుకునేలా మ్యూజిక్ షోలనూ ఏర్పాటుచేశామన్నారు. ఎన్‌చాంటెడ్ జంగిల్ అంటూ జగదేవ్‌పూర్(Jagdevpur)లో అటవీ నేపథ్యంలో నిర్వహించబోతున్న పార్టీ, మట్టి వాసనలు వెదజల్లే వాయిద్యాలపై పాశ్చాత్య సంగీతఝురులను వినిపించే కార్యక్రమాలను కొందరు నిర్వాహకులు చేపట్టారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో 70శాతం పార్టీ, 30శాతం రెజువనేషన్ అంటూ ఓ ఫార్మ్ హౌస్‌లో నిర్వహించబోతున్న పార్టీ తరహాలోనే మరికొంత మంది కూడా పార్టీలను నిర్వహించబోతుండటం విశేషం.
అందుబాటు ధరల్లోనే.. అయినా డౌటే..!?
కొత్త సంవత్సర వేడుకలకు గతంలో రూ.3వేల నుంచి 5వేల వరకు ఉన్న ప్రవేశ ఫీజుల స్థానంలో ప్రస్తుతం రూ.500 వసూలు చేస్తున్నామంటున్నారు. ఇదే విషయమై ఈవెంట్ నిర్వాహకుడు శివ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా పోలీసులు ఉపేక్షించే పరిస్థితి లేదని, అందుకే లిక్కర్, ఫుడ్ పరంగా ఎవరికి తోచిన రీతిలో వారు వ్యవహరించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
పలువురు ఈవెంట్ల నిర్వాహకులు మాట్లాడుతూ పరిమితికి మించి పాస్‌లు జారీ చేయడం లాంటి వాటికి దూరంగా ఉంటూనే ఒంటిగంటకు పార్టీ బంద్ అవుతుందని తెలిపారు. అన్‌లిమిటెడ్ లిక్కర్ అయినా లిమిట్‌లో ఉన్నంత వరకూ మాత్రమే సర్వ్ చేస్తామన్నారు.
ఈవార్తను కూడా చదవండి: KTR: 7న విచారణకు రండి
ఈవార్తను కూడా చదవండి: Dharani: సంక్రాంతిలోపే భూ భారతి!
ఈవార్తను కూడా చదవండి: Nalgonda: ఫోన్ మాట్లాడుతూ విద్యుత్ తీగను తాకి..
ఈవార్తను కూడా చదవండి: భార్య, పిల్లలకు విషం ఇచ్చి.. ఉరేసుకున్న కానిస్టేబుల్
Read Latest Telangana News and National News