Share News

Khammam: సురక్షితం..

ABN , Publish Date - Sep 02 , 2024 | 03:22 AM

భారీ వర్షాలతో ఖమ్మం సమీపంలోని మున్నేరు ఉప్పొంగడంతో నగరంలోని ప్రకాశ్‌నగర్‌ బిడ్జిపై చిక్కుకున్న 9 మంది ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు.

Khammam: సురక్షితం..

  • ఖమ్మంలో బ్రిడ్జిపై చిక్కుకున్న కార్మికులు

  • ఉదయం 9 నుంచి రాత్రి 10 దాకా అక్కడే

  • రాత్రి వరద తగ్గడంతో సురక్షితంగా బయటికి

ఖమ్మం, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): భారీ వర్షాలతో ఖమ్మం సమీపంలోని మున్నేరు ఉప్పొంగడంతో నగరంలోని ప్రకాశ్‌నగర్‌ బిడ్జిపై చిక్కుకున్న 9 మంది ఎట్టకేలకు సురక్షితంగా బయటపడ్డారు. ఆదివారం ఉదయం 9 గంటలకు చిక్కుకున్న కార్మికులు రాత్రి 10 గంటల వరకు బిక్కుబిక్కుమంటూ గడిపారు. స్పీడ్‌బోట్లు, రెస్క్యూ టీంలు అందుబాటులో లేపోవడంతో వారిని వెంటనే తీసుకురావడం సాధ్యంకాలేదు. అయితే స్థానికులు డ్రోన్‌ సాయంతో వారికి భోజనం అందించడంతో పాటు లైఫ్‌ జాకెట్లు, టార్చ్‌లైట్లు ఇచ్చారు.


రాత్రి 7గంటల సమయంలో మంత్రి తుమ్మల సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ఘటనా స్థలానికి చేరుకోగా బాధితుల బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వరదలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు ఉదయం నుంచి అధికారులు సరిగా స్పందించలేదని, రెస్క్యూ బృందాలను తీసుకురాలేదని మండిపడ్డారు. రాత్రి 9 గంటలకు వచ్చిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం 10 గంటలకు స్పీడ్‌ బోట్ల సాయంతో బ్రిడ్జిపైకి వెళ్లగా.. అప్పటికే వరద కాస్త తగ్గడంతో బాధితులు బిడ్జికి మరోవైపు నుంచి సురక్షిత ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో 13 గంటల ఉత్కంఠకు తెరపడింది.

Updated Date - Sep 02 , 2024 | 03:22 AM