Kamareddy: దారుణం.. చెరువులో దూకిన ముగ్గురు పోలీసులు, చివరికి ఏమైందంటే..
ABN , Publish Date - Dec 26 , 2024 | 07:25 AM
తెలంగాణ: సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఒకేసారి ముగ్గురు ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. బిక్కనూర్ ఎస్సై సాయికుమార్, బీబీపేట పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్.. అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్దచెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
కామారెడ్డి: సదాశివనగర్ (Sadhasiva Nagar) మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి (Adlur Yellareddy) పెద్ద చెరువులో ఒకేసారి ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది. బిక్కనూర్ (Bikkanur) ఎస్సై సాయికుమార్, బీబీపేట్ (Bibipet) పోలీస్ స్టేషన్‌కు చెందిన మహిళా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్.. అడ్లూర్ ఎల్లారెడ్డి పెద్దచెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. బుధవారం అర్దరాత్రి ఎస్సై సాయికుమార్ కారులో ముగ్గురూ చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ ఏం జరిగింతో తెలియదు కానీ అందరూ కలిసి చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు.
అయితే పెద్ద చెరువు వద్ద కారు ఆగి ఉండడాన్ని గమనించిన స్థానికులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. సాయికుమార్, శృతి, నిఖిల్ చెప్పులు, సెల్ ఫోన్లు ఉండడాన్ని గుర్తించి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులతోపాటు విషయం తెలుసుకున్న జిల్లా ఎస్పీ సింధూ శర్మ సైతం అర్దరాత్రే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గజఈతగాళ్ల సహాయంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, గురువారం తెల్లవారుజాము సమయంలో శృతి, నిఖిల్ మృతదేహాలను గజఈతగాళ్లు బయటకు తీసుకువచ్చారు. ఎస్సై సాయికుమార్ కోసం తీవ్ర గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఎస్సై సమాచారం ఎంతకీ తెలియకపోవడంతో పలు అనుమానాలకు తావిచ్చింది. అనంతరం ఇవాళ ఉదయం 8:30గంటలకు ఎస్సై సాయికుమార్ మృతదేహం సైతం లభ్యమైంది. ఎస్సై స్వస్థలం మెదక్ జిల్లా కొల్చారం కాగా, గాంధారికి చెందిన శృతి పదేళ్లుగా కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నారు. శృతికి వివాహం జరిగి విడాకులు తీసుకున్నారు. బీబీపేట పోలీస్ స్టేషన్‌లో శృతి కానిస్టేబుల్‌గా పని చేస్తుండగా.. కంప్యూటర్ ఆపరేటర్‌గా నిఖిల్ ఉద్యోగం చేస్తున్నారు.
ఎస్సై సాయికుమార్‌కు కానిస్టేబుల్ శృతితో గతంలోనే పరిచయం ఉంది. సాయికుమార్ రెండేళ్ల క్రితం బీబీపేట ఎస్సైగా పని చేసిన సమయంలో శృతి అక్కడే పనిచేసేవారు. ఆమెకు అప్పటికే వివాహమై.. భర్తతో విడాకులు కూడా అయ్యాయి. దీంతో సాయికుమార్, శృతి మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసిందన్న ఆరోపణలున్నాయి. వీరి మధ్య బీబీపేట సింగిల్ విండో సొసైటీలో ఆపరేటర్‌గా పని చేస్తున్న నిఖిల్ అనే వ్యక్తి మధ్యవర్తిగా వ్యవహరించినట్లు సమాచారం. అయితే ఆ తర్వాత సాయికుమార్ భిక్కనూరుకు బదిలీ కావడంతో శృతితో దూరం పెరిగిందని, తనను పెళ్లి చేసుకోవాలని ఆమె ఒత్తిడి తేవడంతో వీరి మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలిసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Hyderabad: మూతపడిన ఈవెనింగ్ క్లినిక్స్..
Anurag Thakur: రాజకీయాలు వద్దు.. సామరస్యంగా పరిష్కరించుకోవాలి