Share News

Basara: సరస్వతీ దేవి ఆలయంలో మూల నక్షత్ర పర్వదిన వేడుకలు

ABN , Publish Date - Oct 09 , 2024 | 07:56 AM

దక్షిణ భారతదేశంలోని ఏకైక చదువుల తల్లి కొలువైన బాసర క్షేత్రంలో మూల న‌క్షత్రం పుర‌స్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి భ‌క్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చరేయిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం అర్ధరాత్రి మూల న‌క్షత్రం వ‌స్తుంద‌ని, రెండు గంటల నుంచి ఆలయంలో అక్షరాభ్యాస పూజలను ప్రారంభించారు.

Basara: సరస్వతీ దేవి ఆలయంలో మూల నక్షత్ర పర్వదిన వేడుకలు

నిర్మల్ జిల్లా: బాసర సరస్వతీ దేవి ఆలయం (Basara Saraswati Devi Temple)లో నవరాత్రి ఉత్సవాలు (Navratri celebrations) వైభ‌వంగా జరుగుతున్నాయి. బుధవారం మూల నక్షత్ర (Mula Nakshatra) పర్వదిన వేడుకలు (Celebrations) ఘనంగా జరుగుతున్నాయి. అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. తెల్లవారు జాము రెండు గంటల నుంచే దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్బంగా అక్షరాభ్యాస కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మండపాలు కిట కిట లాడుతున్నాయి. అమ్మవారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


దక్షిణ భారతదేశంలోని ఏకైక చదువుల తల్లి కొలువైన బాసర క్షేత్రంలో మూల న‌క్షత్రం పుర‌స్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి భ‌క్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చరేయిస్తున్నారు. దీనికి సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మంగళవారం అర్ధరాత్రి మూల న‌క్షత్రం వ‌స్తుంద‌ని, రెండు గంటల నుంచి ఆలయంలో అక్షరాభ్యాస పూజలను ప్రారంభించారు. తెల్లవారు జాము ఐదు గంట‌ల నుంచి అమ్మవార్ల ద‌ర్శనానికి భ‌క్తులు బారులు తీరారు. కాగా దేశంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో బాస‌ర శ్రీ జ్ఞాన స‌ర‌స్వతీ దేవీ అమ్మవారి ఆల‌యం ఒక‌టి.


అక్షరాభ్యాసం టికెట్ ధ‌ర రూ.150, రూ.1000

అమ్మవారి సన్నిధిలో సాధారణంగా అక్షరాభ్యాసం టికెట్ 150 రూపాయలు, రూ.1000లుగా నిర్ణయించిన‌ట్లు ఆల‌య అధికారులు తెలిపారు. అక్షరాభ్యాస పూజలకు, సర్వదర్శననికి వేరు వేరుగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. అలాగే ఆన్‌లైన్ టికెట్ల ప్రత్యేక అక్షరాభ్యాస క్యూలైన్లు, రూ.100, ప్రత్యేక‌ దర్శనానికి క్యూ లైన్ ఆలయ అతిథి గృహాల వద్ద నుండి ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

కాగా మూల నక్షత్ర పర్వదిన వేడుకలు సందర్భంగా పెద్ద సంఖ్యలో భ‌క్తులు వ‌స్తార‌ని, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆల‌య ఈవో విజ‌య‌రామారావు తెలిపారు. అక్షరాభ్యాస పూజలు సర్వదర్శనాల క్యూ లైన్‌లో భక్తులకు పాలు, నీరు అందుబాటులో ఉంచుతున్నామ‌ని చెప్పారు. రెండు బయో టాయిలెట్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే గోదావరి నది తీరాన అందుబాటులో 40 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటు చేశామన్నారు. వాహనాలకు మూడు చోట్ల పార్కింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ

సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిస్తున్న దుర్గమ్మ

సమంతపై త్రివిక్రమ్ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 09 , 2024 | 07:56 AM