NTPC Ramagundam: రామగుండం ఎన్టీపీసీకి అవార్డుల పంట
ABN , Publish Date - Nov 25 , 2024 | 04:03 AM
రామగుండం ఎన్టీపీసీకి అవార్డుల పంట పండింది. గోవాలో శనివారం జరిగిన అపెక్స్ ఇండియా ఫౌండేషన్ అవార్డుల కార్యక్రమంలో రామగుండం ప్రాజెక్టు అధికారులకు పురస్కారాలను ప్రదానం చేశారు.
జ్యోతినగర్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): రామగుండం ఎన్టీపీసీకి అవార్డుల పంట పండింది. గోవాలో శనివారం జరిగిన అపెక్స్ ఇండియా ఫౌండేషన్ అవార్డుల కార్యక్రమంలో రామగుండం ప్రాజెక్టు అధికారులకు పురస్కారాలను ప్రదానం చేశారు. ఎన్టీపీసీ ఆర్‌ఈడీ కేదార్ రంజన్ పాండుకు లీడర్ సీఈవో ఆఫ్ ది ఇయర్ 2024 అవార్డు, టెక్నాలజీ ఎక్స్‌లెన్స్ కేటగిరీలో ప్లాటినం అపెక్స్ అవార్డు, హెచ్‌ఆర్ ఎక్స్‌లెన్స్‌లో గోల్డ్ అవార్డు, ట్రైనింగ్ ఎక్స్‌లెన్స్‌లో గోల్డ్ అవార్డు, సేఫ్టీ అండ్ ఆక్యుపేషనల్ హెల్త్‌లో గోల్డ్ అవార్డు లభించాయి. ఎన్టీపీసీ ఆర్‌ఈడీ కేదార్ రంజన్, ఏజీఎం (హెచ్‌ఆర్) విజయ్ కుమార్ సిక్దర్, అధికారి ప్రజ్ఞ అవార్డులను అందుకున్నారు.