Telangana : ఉస్మానియా నూతన భవనాన్ని త్వరగా నిర్మించాలి
ABN , Publish Date - May 29 , 2024 | 04:09 AM
ఉస్మానియా ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సదుపాయాలు, నాణ్యమైన వైద్యం అందాలంటే వీలైనంత త్వరగా నూతన భవనాన్ని నిర్మించాలని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు
ప్రొఫెసర్ కోదండరాం
అఫ్జల్‌గంజ్, మే 28 (ఆంధ్రజ్యోతి): ఉస్మానియా ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన సదుపాయాలు, నాణ్యమైన వైద్యం అందాలంటే వీలైనంత త్వరగా నూతన భవనాన్ని నిర్మించాలని తెలంగాణ జనసమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అయితే పాత భవనం కూల్చివేసి కట్టాలో? లేక చంచల్‌గూడ ప్రింటింగ్ ప్రెస్ లేదా గోషామహల్ స్టేడియంలో కట్టాలో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
మంగళవారం ఉస్మానియా ఆసుపత్రి సూపరింటెండెంట్ కాన్ఫరెన్స్ హల్‌లో ఆసుపత్రి నూతన భవన నిర్మాణంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా...నూతన భవన నిర్మాణం కోసం వైద్యులు చేస్తున్న కృషికి తోడ్పాటు అందిస్తామన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో భవన నిర్మాణం కోసం రూ.200 కోట్ల నిధులు కేటాయించినప్పటికీ... అనేక అభ్యంతరాల కారణంగా అది రూపుదాల్చలేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ అజీజ్ పాషా, సియాసత్ సంపాదకుడు అమీర్ అలీఖాన్‌లు పాల్గొన్నారు.