Home » Kodandaram
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ (హెచ్సీయూ) విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని తమ టీజేఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని ఆ పార్టీ అధినేత, ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు.
2025-26 బడ్జెట్ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు ప్రస్తుత ప్రభుత్వానికి ప్రతిబంధకంగా మారాయన్నారు.
జీహెచ్ఎంసీ కార్మికులు చేస్తున్న సేవలను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తిస్తుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం(MLC Professor Kodandaram) అన్నారు.
కాళేశ్వరం ఎంతో అద్భుతమైన ప్రాజెక్టు అని మాజీ సీఎం కేసీఆర్ అవాస్తవాలు ప్రచారం చేశారని ఎమ్మెల్సీ కోదండరామ్ విమర్శించారు.
Prof Kodandaram: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేకుంటే ప్రజలకు జరిగే ఆ కాస్త న్యాయం కూడా జరిగేలా లేదని ఎమ్మెల్సీ కోదండరాం అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. ప్రత్యేక తెలంగాణ కోసం.. ఆ రాష్ట్ర ప్రజల చేసిన త్యాగానికి సైతం అర్ధం లేకుండా పోతుందని ఆయన ఆవేదన చెందారు.
పనికిరాని స్థలంలో మేడిగడ్డ కట్టారని ఎమ్మెల్సీ కోదండరాం విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టును తుమ్మిడిహట్టి వద్ద కట్టాల్సిందేనని చెప్పారు. మేడిగడ్డ పనికిరాదని సీడబ్ల్యూసీ తేల్చి చెప్పిందని అన్నారు.
పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలని, జనగణనలో కులగణన చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య(Former MP R. Krishnaiah) డిమాండ్ చేశారు. బీసీలంతా ఐక్యంగా ఉండి రాజ్యాధికారం వైపు అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో త్వరలోనే ప్రజాస్వామ్య తెలంగాణను స్థాపిస్తామని, అందుకోసం విధి విధానాలను రూపొందిస్తున్నామని టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోదండరాం తెలిపారు. తెలంగాణలో అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయని, వాటి పునరుద్ధరణ కోసం సీఎం రేవంత్రెడ్డి, మంత్రులతో చర్చలు జరుపుతున్నారని చెప్పారు.
కార్మికల హక్కులను సాధించకోవడానికి యూనియన్లు ఎంతో దోహదపడుతాయని ప్రొఫెసర్, ఎమ్మెల్సీ కోదండరాం(MLC Kodandaram) అన్నారు. మంగళవారం అల్వాల్ పంజాబ్ కమ్యూనిటీ హాల్ల్లో నిర్వహించిన అల్వాల్ సర్కిల్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యుల సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఔట్సోర్సింగ్ ఉద్యోగులు దోపిడీకి గురవుతున్నారని, వారికి రావల్సి జీతాన్ని కార్పొరేషన్ ద్వారా అందే విధంగా చూడాల్సిన అవసరం ఉందన్నారు.
కేసీఆర్ ఒక్కడి వల్లనే తెలంగాణ రాష్ట్రం రాలేదని, ప్రజలంతా ఐక్యంగా ఉద్యమిస్తేనే రాష్ట్రం సిద్ధించిందని ఎమ్మెల్సీ కోదండరాం అన్నారు.