Sangareddy: 17 సీట్లలో గెలుపు మాదే: జి.కిషన్‌రెడ్డి
ABN , Publish Date - May 01 , 2024 | 06:25 AM
లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 సీట్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
మోదీకి దేశంలోని అన్నివర్గాల మద్దతు: కిషన్‌రెడ్డి
సంగారెడ్డి/అడ్డగుట, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 సీట్లలో బీజేపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం వద్ద బీజేపీ నిర్వహించిన విశాల్ జనసభలో ఆయన పాల్గొన్నారు. సికింద్రాబాద్ కోర్టులోని బార్ అసోసియేషన్ చాంబర్‌లో న్యాయవాదులను కలిశారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మోదీ దేశ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేస్తున్నారని, అందుకే అన్నివర్గాల ప్రజలు మోదీకి తమ మద్దతు తెలుపు తూ తీర్మానాలు చేస్తున్నారని పేర్కొన్నారు.
కాగా, ఉమ్మడి మెదక్ జిల్లాలోని నలుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు హరీశ్‌రావు పంపించి ట్రయిల్‌రన్ మొదలుపెట్టారని మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆరోపించారు. సీఎంగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక.. ఆయన, హరీశ్‌రావు ఒకే విమానంలో ఢిల్లీకి వెళ్లారని, ఆ సమయంలో ఈ విషయాలన్నింటినీ చర్చించుకున్నారన్నారు. బీఆర్‌ఎస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలను కాంగ్రె్‌సలోకి తీసుకొస్తానని హరీశ్.. రేవంత్‌రెడ్డికి హామీ ఇచ్చారని ఆయన ఆరోపించారు.