Phone Tapping: సీఎం, ఇంటెలిజెన్స్ ఐజీ నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు: ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి
ABN , Publish Date - Dec 05 , 2024 | 04:14 AM
కొద్దినెలలుగా సీఎం రేవంత్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి తన మొబైల్ ఫోన్ ట్యాప్ చేస్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశికర్‌రెడ్డి ఆరోపించారు.
హైదరాబాద్/బంజారాహిల్స్, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): కొద్దినెలలుగా సీఎం రేవంత్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్‌రెడ్డి తన మొబైల్ ఫోన్ ట్యాప్ చేస్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశికర్‌రెడ్డి ఆరోపించారు. బుధవా రం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం ప్రోద్భలంతో శివధర్‌రెడ్డి తనఫోన్ ట్యాప్ చేసి డ్రగ్స్ కేసులో ఇరికించాలని ప్రయత్నించారన్నారు. తాను కేసు పెట్టేందుకు బంజారాహిల్స్ ఏసీపీకి ఫోన్ చేస్తే రమ్మన్నారని, తనకు చెప్పిన సమయానికి ముందే ఆయన పోలీ్‌సస్టేషన్ నుంచి వెళ్లిపోయారని చెప్పారు. స్టేషన్‌లో ఉన్న సీఐ తానొక ఎమ్మెల్యే అనే గౌరవం లేకుండా ప్రవర్తించారన్నారు.
ఫోన్‌ట్యాపింగ్‌కు సంబంధించి సీఎం, డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీపైనా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. కాగా, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బుధవారం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్ వద్ద హంగామా సృష్టించారు. తన ఫిర్యాదు తీసుకోవాలని స్టేషన్ నుంచి బయటకు వెళుతున్న ఇన్‌స్పెక్టర్ రాఘవేంద్ర వాహనాన్ని అడ్డుకోవడమే కాకుండా దుర్భాషలాడారు. ఈ నేపథ్యంలో విధులకు ఆటంకం కలిగించారని కౌశిక్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించారు.